MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.. బీరు బాటిల్లో చేప పిల్ల‌. ఎలా వ‌చ్చింద‌బ్బా?

Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.. బీరు బాటిల్లో చేప పిల్ల‌. ఎలా వ‌చ్చింద‌బ్బా?

Viral Video: స‌మ్మ‌ర్‌లో స‌హ‌జంగానే బీర్ల‌కు డిమాండ్ పెరుగుతుంది. ఇలాగే హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి కూల్ బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అయితే ఈ క్ర‌మంలో జ‌రిగిన ఓ సంఘటన ఒక్క‌సారిగా షాక్‌కి గురి చేసింది. బీర్ బాటిల్లో చేప కనిపించడం వైరల్ గా మారింది 

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 07 2026, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిల్డ్ బీర్ తాగుదామనుకున్న కస్టమర్‌కు షాక్
Image Credit : ChotaNews App/X

చిల్డ్ బీర్ తాగుదామనుకున్న కస్టమర్‌కు షాక్

హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ ప్రాంతంలో వింత‌ ఘటన జరిగింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక వైన్ షాప్‌కు వెళ్లిన వ్యక్తి చల్లని బీర్ కొనుగోలు చేశాడు. స‌మ్మ‌ర్ కావ‌డంతో చల్లని బీర్ తాగి రిలాక్స్ అవుదామని భావించాడు. అయితే బాటిల్‌ను తెరవడానికి ముందే లోపల ఏదో కదులుతున్నట్టు కనిపించడంతో జాగ్రత్తగా పరిశీలించాడు.

25
బాటిల్‌లో కదులుతున్న చేపపిల్ల
Image Credit : ChotaNews App/X

బాటిల్‌లో కదులుతున్న చేపపిల్ల

కస్టమర్ దగ్గరగా చూసినప్పుడు బీర్ బాటిల్ లోపల చిన్న చేపపిల్ల కదులుతున్నట్టు కనిపించింది. సీల్ చేసిన‌ బాటిల్‌లో ఇలా చేప ఉండటం చూసి అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే బాటిల్‌ను తీసుకుని షాప్ నిర్వాహకులకు చూపించాడు. అక్కడున్నవారు కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.

Related Articles

Related image1
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో
Related image2
నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
35
షాప్ నిర్వాహకులు ఏమ‌న్నారంటే.?
Image Credit : ChotaNews App/X

షాప్ నిర్వాహకులు ఏమ‌న్నారంటే.?

బీర్ బాటిల్‌లో చేపపిల్ల ఎలా వచ్చిందని కస్టమర్ ప్రశ్నించగా షాప్ నిర్వాహకులు బాధ్యత తీసుకోలేమని చెప్పారు. తమ వద్ద బీర్ తయారు చేయడం జరగదని, కేవలం కంపెనీ నుంచి వచ్చిన బాటిళ్లను మాత్రమే అమ్ముతామని సమాధానం ఇచ్చారని బాధితుడు పేర్కొన్నాడు. దీంతో ఈ ఘటనపై మరింత చర్చ మొదలైంది.

45
ఇంత‌కీ చేప ఎలా వ‌చ్చింది.?
Image Credit : ChotaNews App/X

ఇంత‌కీ చేప ఎలా వ‌చ్చింది.?

సీల్ చేసిన బాటిల్‌లో చేప ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తయారీ కేంద్రంలో బాటిళ్లను శుభ్రం చేసే సమయంలో లేదా బీర్ నింపే ప్రక్రియలో ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొంద‌రు మాత్రం బీర్ త‌యారీకి ఉప‌యోగించే నీటిని చెరువుల నుంచి త‌ర‌లించ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుండొచ్చ‌ని అంటున్నారు. అయితే అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.

55
సోషల్ మీడియాలో వైరల్
Image Credit : ChotaNews App/X

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. బీర్ బాటిల్‌లో చేప కనిపించడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఏదైనా తాగేముందు ఒకసారి బాటిల్ లోపల చూసుకోవడం మంచిది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన ఆల్కహాల్ తయారీ సంస్థల నాణ్యత నియంత్రణపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..? | Asianet News Telugu
Recommended image2
Alcohol : మగువలు మందుకొట్టే టాప్ 7 రాష్ట్రాలివే.. తెలంగాణ స్థానమెంత..?
Recommended image3
తెలంగాణలో కేసీఆర్ కులపోళ్లకు ఎంత భూమి ఉందో తెలుసా..?
Related Stories
Recommended image1
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో
Recommended image2
నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved