హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ర్పచారంపై సినీ రచయిత చిన్నికృష్ణ తీవ్రంగా స్పందించారు. నీచమైన, దగుల్బాజీ, గజ్జి కుక్కలు వైఎస్‌ షర్మిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. 

టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చిన్నకృష్ణ అన్నారు. వైఎస్‌ షర్మిలపై ఆరోపణలు చేయడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఆడపడుచుపై  తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

ప్రజా సమస్యలపై పోరాడుతున్న కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణమని చిన్నికృష్ణ అన్నారు. వైఎస్‌ షర్మిల ఫిర్యాదుపై తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా కేసును విచారిస్తుందని నమ్మకం ఉందని చెప్పారు. ఏపీలో పరిపాలన అన్నదే లేదని, టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. 


ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సౌత్‌ ఇండియా సినీ ఇండస్ట్రీ మొత్తం వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర గురించే మాట్లాడుతోందని తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత వైఎస్సార్‌ కుటుంబానిదేనని అన్నారు. 

సంబంధిత వార్తలు

బాబుకు అలవాటే, చిరుపై లాగానే వైఎస్ షర్మిలపై..: పోసాని

షర్మిల ఫిర్యాదుపై కేసు: దర్యాప్తునకు ప్రత్యేక బృందం

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!