దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకి సినీ నటుడు ప్రభాస్ కి చాలా కాలంగా ఎఫైర్ సాగుతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయంపై గతంలో స్పందించిన ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టి.. ఓ అమ్మాయిని ఇంతగా కించపరచడం కరెక్ట్ కాదని, తనకి ఎవరితో ఎలాంటి ఎఫైర్ లేదని క్లారిటీ ఇచ్చాడు. అక్కడితో  విషయం సద్దుమణిగిందనుకుంటే.. మళ్లీ ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. 

దీంతో ఈసారి షర్మిల స్పందించక తప్పలేదు. మీడియా ముఖంగా ఆమె మాట్లాడుతూ.. 'ఐదేళ్ల క్రితం మొదలైన ఈ దుష్ప్రచారం.. ఇప్పుడు మళ్ళీ మొదలైందని' వాపోయింది.  ప్రభాస్ అనే వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేసింది షర్మిల. ఒక్కసారి కూడా అతడితో మాట్లాడలేదని, ఇదే నిజమని పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్పింది.

ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నవారు ఇవన్నీ నిజమేనని ప్రమాణాలు చేసి చెప్పగలరా..? అని ప్రశ్నించింది. పోనీ ఆ వ్యక్తిని కలిసినట్లు గానీ, మాట్లాడినట్లు గానీ రుజువులు, ఆధారాలు చూపించగలరా..? అని సవాల్ విసిరింది. 

పుకార్లు పుట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది. తనను ప్రేమించే భర్త, పిల్లలు, కుటుంబం, స్నేహితులు ఉన్నారని తనతో పాటు వీరందరినీ కూడా బాధ పెట్టిన విషయమిదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలాంటి పుకార్లు పుట్టించి పైశాచిక ఆనందం పొందడం ఏంటని..? నిలదీసింది. ఇంతలా ఎలా దిగజారుతారని..? ఇలాంటి పుకార్లు పుట్టించినవారికి సిగ్గుగా అనిపించడం లేదా..? అంటూ ఫైర్ అయింది. 

ఈ విషయాలపై మాట్లాడకపోతే ఇదే నిజమని కొందరు అనుకునే ప్రమాదముందని అందుకే స్పందించినట్లు క్లారిటీ ఇచ్చింది. తన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గనుక మీడియా ముందుకొచ్చి చెబుతున్నట్లు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు..

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?