కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి కుటుంబంపై కూడా పుకార్లు ప్రచారం చేశారని, వైఎస్ షర్మిల విషయంలోనూ చంద్రబాబు అదే పంథాను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. 

ప్రత్యర్థుల ఇంట్లో వాళ్లపై ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బాగా అలవాటని పోసాని కృష్ణమురళి అన్నారు. మంగళవారం ఆయన కడప శివారులోని ఇర్కాన్‌ సర్కిల్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఏ ఎన్నికల్లో కూడా ఎంపీ గానీ ఎమ్మెల్యేగా గానీ పోటీ చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. జీవితాంతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

షర్మిల ఫిర్యాదుపై కేసు: దర్యాప్తునకు ప్రత్యేక బృందం

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!