సినీనటుడు ప్రభాస్‌తో తనకు సంబంధాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం దర్యాప్తులో వేగం పెంచింది. షర్మిలపై నెగిటివ్ గా ప్రచారం చేసిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులు ఆరుగురికి 41(ఎ) నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 15 సోషల్ మీడియా వెబ్ సైట్లను గుర్తించిన పోలీసులు మిగితావారికి కూడా నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. యూట్యూబ్ నుంచి వివరాల కోసం వేచి చూస్తున్నారు. వివరాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం అదనపు డీసీసీ రఘువీర్ తెలిపారు.

హీరో ప్రభాస్‌తో తనకు సంబంధముందని సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్‌ షర్మిల ఈ నెల 14న హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుష్ప్రచారానికి పాల్పడ్డారనే అనుమానాలతో యూట్యూబ్‌లో మొత్తం 15 వీడియో లింకుల్ని పోలీసులు గుర్తించారు. అవి ఏయే ఐపీ అడ్రస్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేశారో వివరాలు సేకరించి వాటి ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరంతా హైదరాబాద్‌ వాసులేనని ప్రాథమికంగా గుర్తించారు.

read more news

షర్మిల-ప్రభాస్ కేసు: 5 యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుల విచారణ

షర్మిల ఫిర్యాదు: యూట్యూబ్, గూగుల్‌లకు లేఖ

ప్రభాస్ తో అఫైర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిలకు రాములమ్మ బాసట

షర్మిలకు బాబు కౌంటర్: నమ్మకపోతే పోటీ ఎందుకు

దగుల్బాజీ, గజ్జి కుక్కలు: వైఎస్ షర్మిల ఇష్యూపై చిన్నికృష్ణ

బాబుకు అలవాటే, చిరుపై లాగానే వైఎస్ షర్మిలపై..: పోసాని

షర్మిల ఫిర్యాదుపై కేసు: దర్యాప్తునకు ప్రత్యేక బృందం

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!