హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై  విచారణ చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ చెప్పారు. ఈ విషయమై గూగుల్‌కు, యూ ట్యూబ్‌కు  లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.

రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేస్తున్నారని షర్మిల హైద్రాబాద్ సీఫీ అంజనీకుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదును సీపీ  అంజనీ కుమార్  సైబర్ క్రైమ్‌కు బదిలీ చేశారు.

షర్మిల ఫిర్యాదు మేరకు  విచారణను ప్రారంభించినట్టు రఘువీర్ తెలిపారు. ఇదే విషయమై 2014లో ముగ్గురు నిందితులను కూడ అరెస్ట్ చేసినట్టు ఆయన గుర్తించారు. ఈ దఫా  23 యూ ట్యూబ్ లింకులపై విచారణ చేస్తున్నట్టు రఘువీర్ తెలిపారు.

షర్మిలను ఎవరు ట్రోలింగ్ చేస్తున్నారనే విషయమై విచారణ చేస్తున్నామన్నారు. ఈ విషయమై గూగుల్‌, యూ ట్యూబ్‌లకు కూడ లేఖలు రాసినట్టు ఆయన చెప్పారు. 15 రోజుల్లో ఈ విషయమై సమాధానం వచ్చే అవకాశం ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రోలింగ్‌కు గురౌతున్న మహిళలు షర్మిల మాదిరాగా  బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.  పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూ ట్యూబ్ ఛానెల్స్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. షర్మిలపై ట్రోలింగ్ చేస్తున్న వారిని త్వరలోనే పట్టుకొంటామని ఆయనప విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.


సంబంధిత వార్తలు

షర్మిలకు బాబు కౌంటర్: నమ్మకపోతే పోటీ ఎందుకు