హైదరాబాద్: వైఎస్ షర్మిళ వ్యహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యహరించిన తీరు సరికాదని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాయలంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు తీరును తప్పుబట్టారు. 

ఒకప్పటి స్నేహితుడు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె తనను వేధిస్తున్నారు అని వాపోతే తండ్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ఆదుకోవాల్సింది పోయి వెటకారంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. 

రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేత సోదరి తనకు జరుగుతున్న అన్యాయంపై విలపిస్తుంటే స్పందించాల్సింది పోయి మీకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదు కదా అంటూ మాట్లాడతారా అది కరెక్టా అని నిలదీశారు. 

పిల్లల మీద ప్రమాణం చేసి తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తే ఏపీ పోలీసులపై నమ్మకం లేదు కదా పాకిస్తాన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి అంటూ మాట్లాడుతారా అంటూ అది మీ స్థాయికి తగునా అని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం పింఛన్ పెంచిన విషయం పక్కదారి పట్టించేందుకు షర్మిల వ్యహారాన్ని తెరపైకి తెచ్చారంటూ ఆరోపిస్తారా అంటూ బుగ్గన మండిపడ్డారు.     
 

ఈ వార్తలు కూడా చదవండి

హరికృష్ణ శవం పక్కనే కేటీఆర్ తో పొత్తు చర్చలు: బాబుపై బుగ్గన

మా హామీలు, కేసీఆర్ స్కీమ్స్ కాపీ: చంద్రబాబుపై బుగ్గన ఫైర్