తనపై సోషల్ మీడియా మాధ్యమాల్లో అసభ్యకరమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై వైఎస్సార్ సిపి అధినేత జగన్ సోదరి షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇవాళ హైదరాబాద్ కమీషనర్  అంజనీ కుమార్‌నును కలిసి ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. సామాజి మాధ్యమాల్లో తనపై అసభహ్యకర వ్యాఖ్యలు ప్రచారం చేస్తువారిపై  చర్యలు తీసుకోవాలని కమీషనర్ కు ఫిర్యాదు చేసినట్లు షర్మిల తెలిపారరు. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తల పేరుతో వస్తున్న పోస్టింగులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల క్రితం పోలీసుల చర్యలతో ఈ వార్తలు ఆగినా ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మళ్లీ ప్రచారం మొదలయ్యిందని ఆమె పేర్కొన్నారు. 

తన క్యారెక్టర్‌ను చెడుగా చూపించడానికే కావాలనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగోందని  ఆరోపించారు. ఈ దుష్ప్రచారాన్ని మన జమాజం ఆమోదించవద్దని కోరారు. కొందరు నాయకులు, పార్టీలు చెప్పే మహిళా సాధికారత, సామాజిక స్పృహ అను మాటలు కాగితాలకు పరిమితం కావద్దన్నారు. వీటికోసం మనం  గొంతెత్తాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిదన్నారు.  

తనపై వెబ్ సైట్లలో, సోషల్ మీడియా లో వస్తున్న వార్తలకు వ్యతిరేకంగా  తాను చేసిన ఫిర్యాదును అందరూ సమర్ధించాలని షర్మిల కోరారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిని, చేపిస్తున్న వారని కఠినంగా శిక్షించాలన్నారు. వారి వల్ల ప్రస్తుతం తాను ఇలా దోషిగా నిలబడాల్సి వచ్చిందన్నారు. 

ఓ భార్యగా, ఓ తల్లిగా, ఓ చెల్లిగా తన నైతికతను  నిజాయితిని నిరూపించుకోవాల్సిన  అవసరం లేదన్నారు. కానీ బయట జరుగుతున్న ప్రచారంపై తాను మాట్లాడకుంటే అదే నిజమని కొందరు భావించే అవకాశం వుంది కాబట్టి బయటకు వచ్చి దానిపై మాట్లాడుతున్నట్లు షర్మిల వెల్లడించారు.

కమీషనర్ ని కలవడానికి షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్,  వైఎస్సార్ సిపి నేతలు వైవి సుబ్బానరెడ్డి, సజ్జల, వాసిరెడ్డి పద్మలు వున్నారు.

సంబంధిత వార్తలు

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!