తెలంగాణకు చెందిన మంత్రి చందూలాల్ తిట్ల పురాణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆయన ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షులు భిక్షపతిని బండ బూతులు తిట్టినట్లు ఒక ఆడియో రికార్డు చక్కర్లు కొడుతోంది. నీ అంతు చూస్తానంటూ, గలీజు పదాలతో తిట్టిన మంత్రి మాటలు ఆ ఆడియో రికార్డులోకి ఎక్కాయి.
టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్, బిజెపి పార్టీలను టార్గెట్ చేశారు. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని విమర్శించారు.
మియాపూర్ భూకుంభకోణంలో అధికార పార్టీలు రెండూ జనాలను గందరగోళంలో పడేసే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బుధవారం ఢిల్లీకి సీఎల్పీ నేత కే. జానారెడ్డితో కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు ఉత్తమ్.
మియపూర్ భూస్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చి రద్దు చేయడం సిగ్గు చేటన్నారు.
సిబిఐ విచారణ జరపకుండా తాత్సారం చేయడం చూస్తే ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లే అని ఆరోపించారు.
