యాద్రాద్రి జిల్లాలో దారుణం: వివాహిత అనుమానాస్పద మృతి, రేప్ చేసి హత్య చేశారా?
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేటలో శ్రావ్య అనే వివాహిత మరణించింది. అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
చౌటుప్పల్:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్‌పేట లో శ్రావ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ఈ విషయమై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులలకు ఫిర్యాదు చేశారు.
Toopranpetలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ వద్ద Sravya భర్త Ashok Naik వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాడు. శ్రావ్య కుటుంబం తూఫ్రాన్ పేటలోని ఓ గోడౌన్ వద్ద నివాసం ఉంటుంది. ఈ గోడౌన్ కు కాపలాగా ఉంటారు. అయితే ఆశోక్ నాయక్ ఇంటికి వచ్చేసరికి శ్రావ్య మరణించింది. శ్రావ్య ఒంటిపై రక్తం మరకలున్నాయి. శ్రావ్య తలపై గాయాలను పోలీసులు గుర్తించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ రాస్ట్రంలోని గత మాసంలో గ్యాంగ్ రేప్ ఘటనలు కలకలం రేపాయి. గుంటూరు జిల్లాలో ఈ తరహా ఘటనలు ఏప్రిల్ మాసంలో ఎక్కువగా నమోదయ్యాయి. ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలోని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్సుడు శివకుమార్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఆరోపణలు చేసింది.తనపై లైంగిక దాడకి పాల్పడినట్టుగా ఆమె ఆరోపించింది. అంతేకాదు తనపై లైంగిక దాడి చేసిన సమయంలో తీసిన పోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆరోపణలు చేసింది. ఈ విషయమై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2020 సంవత్సరంలో మున్సిపాలిటీ ఎన్నికలు ఉండటంతో ఆమెకు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగానే ఆ యువతికి నారాయణపేట జిల్లాలో పని చేయాలని అధిష్టానం పై స్థాయి నాయకులు సూచించారు. దీంతో ఆమె ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ క్రమంలో ఆమెకు ఆ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న శివ కుమార్ రెడ్డి పరిచయం అయ్యాడు.
ఈ సమయంలో శివకుమార్ రెడ్డి ఆమెతో సన్నిహిత్యం పెంచుకోవాలని ప్రయత్నించాడు. తన భార్య ఆరోగ్యం సరిగా ఉండదని, ఆమె మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకదని చెప్పాడు. తనకు ఎలాగూ ఓ తోడు కావాలని తెలిపాడు. బాధిత యువతినే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తరువాత దుబ్బాక ఉప ఎన్నికల టైంలో ఒక రోజు రాత్రి పూట శివకుమార్ రెడ్డి మద్యం సేవించి, బాధిత యువతి ఉంటున్న రూమ్ కు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని చెప్పాడు. తీవ్రంగా బలవంతం పెట్టాడు. అయితే ఆమె సున్నితంగా అతడి కోరికను తిరస్కరించింది. పెళ్లికాక ముందు ఇలాంటివి కుదరవని తేల్చి చెప్పింది. దీంతో కోపగించుకున్న నాయకుడు ఆమెను తీవ్రంగా కొట్టాడు. జుట్టు పట్టుకొట్టుకొని దాడికి పాల్పడ్డాడు. అయితే ఆమె ఎదురుతిరగడంతో అతడు రూమ్ నుంచి వెనక్కివెళ్లిపోయాడు.
తరువాత గతేడాది జూన్ 24వ తేదీన శివ కుమార్ రెడ్డి బాధిత యువతిని ఓ హోటల్ కు తీసుకొని వెళ్లాడు. అక్కడ కూడా ఆమెను బలవంతంగా కోరిక తీర్చాలని ఇబ్బంది పెట్టాడు. దీనిని కూడా ఆమె తిరస్కరించింది. దీంతో ఆ నాయకుడ పసుపు తాడును యువతి మెడలో కట్టాడు. ఇప్పుడు హిందూ సంప్రదాయం, ఆచారాల ప్రకారం ఇద్దరికీ వివాహం అయ్యిందని చెప్పాడు. తరువాత బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత మరో సారి ఆమెను బెంగళూరు తీసుకెళ్లాడు. అక్కడ పని ఉందని చెప్పాడు. అక్కడ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్ కు బాధిత యువతిని పిలిపించాడు. అక్కడ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆమె అడ్డుకుంది. దీంతో అతడు ఆమెను మాటల్లో దింపి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు. ఆ కూల్ డ్రింక్ ను ఆ యువతితో తాగించాడు. ఆమె స్పృహకోల్పోయిన తరువాత లైంగిక దాడి చేశాడు. అదే సమయంలో ఆ యువతి న్యూడ్ ఫొటోలు, వీడియోలు తీశాడు. అప్పటి నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.