కిచెన్ టైల్స్ ను ఇలా క్లీన్ చేస్తే నూనె మరకలు అసలే ఉండవు
కిచెన్ లో వంట చేసేటప్పుడు స్ప్లాష్ ల వల్ల టైల్స్ పై నూనె పడుతుంటుంది. దీనివల్ల టైల్స్ జిడ్డుగా మారుతాయి. కానీ వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ జిడ్డును పోగొట్టొచ్చు. అదెలాగంటే?
వంటింట్లో గోడకు ఉండే టైల్స్ జిడ్డుగా, మురికిగా మారుతుంటాయి. మనం వంట చేసిన ప్రతి సారి టైల్స్ కు జిడ్డు పడుతూనే ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం సాధ్యం కాదు. అందుకే ఆడవాళ్లు నెలకో లేదా వారం పదిహేను రోజులకోసారో క్లీన్ చేస్తుంటారు. కానీ అప్పటికీ ఈ జిడ్డు మొండిగా మారి అస్సలు పోకుండా అవుతుంది. కానీదీనివల్ల కిచెన్ మురికిగా కనిపిస్తుంది. టైల్స్ కూడా పనికిరాకుండా అయిపోతాయి.
వంటింట్లో గ్యాస్ ఉన్న గోడ టైల్స్ కు నూనె, మసాలా దినుసుల మరకలు, చుక్కలు పక్కాగా పడతాయి. దీని వల్ల స్మూత్ గా ఉన్న టైల్స్ మురికిగా కనిపిస్తాయి. వీటిని చాలా రోజుల వరకు క్లీన్ చేయకుండా వదిలేస్తే శుభ్రం చేయడం కష్టంగా మారుతుంది. అందుకే వీటిని ఈజీగా క్లీన్ చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
డిటర్జెంట్ పౌడర్
డిటర్జెంట్ పౌడర్ ను కేవలం బట్టలు ఉతకడానికి మాత్రమే కాదు కిచెన్ టైల్స్ ను క్లీన్ చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం కొంచెం డిటర్జెంట్ పౌడర్ ను తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం, లిక్విడ్ డిష్ వాష్ ను వేసి బాగా కలపండి. దీన్ని కొంచెం వేడి చేయండి. ఆ తర్వాత దీనిని టూత్ బ్రష్ లేదా క్లాత్ బ్రష్ తో టైల్స్ పై పోయండి. దీన్ని బ్రష్ తో రుద్ది క్లీన్ చేయండి. తర్వాత నార్మల్ వాటర్ తో కడిగి తుడవండి. అంతే టైల్స్ కు పట్టిన నూనె జిడ్డు ఇట్టే పోతుంది.
ఉప్పుతో..
ఉప్పుతో కూడా జిడ్డుగా మారిన కిచెన్ టైల్స్ ను చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం కొన్ని నీళ్లను తీసుకుని వేడి చేయండి. ఈ నీళ్లలో గుప్పెడు ఉప్పు, సగం నిమ్మరసం పిండి బాగా కలపండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత స్క్రబ్బర్ లేదా గుడ్డతో టైల్స్ కు రుద్దండి. తర్వాత ఒక గుడ్డను తీసుకుని శుభ్రమైన నీళ్లలో ముంచి టైల్స్ ను తుడవండి. దీంతో టైల్స్ కు అంటిన మురికి పోయి కొత్తవాటిలా మెరుగుస్తాయి.