బూతు మొదలైంది చిరంజీవి, రాఘవేంద్రరావు తోనే..మెగాస్టార్ లో అదొక్కటే పాజిటివ్, నిర్మాత ఓపెన్ కామెంట్స్
సీతామాలక్ష్మి, గోరింటాకు, నారి నారి నడుమ మురారి, జానకి రాముడు లాంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత కాట్రగడ్డ మురారి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో సాధించని విజయం అంటూ లేదు. సాధారణ ఆర్టిస్టుగా మొదలైన చిరంజీవి ప్రయాణం దశాబ్దాల పాటు టాలీవుడ్ లో అగ్రస్థానంలో కొనసాగే వరకు చేరుకుంది. ఈ క్రమంలో చిరంజీవి కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. అదే విధంగా చిరంజీవిని ద్వేషించే వారు కూడా ఉన్నారు. సెలెబ్రిటీలలో చిరంజీవిపై బహిరంగంగా నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు కూడా ఉన్నారు.
సీతామాలక్ష్మి, గోరింటాకు, నారి నారి నడుమ మురారి, జానకి రాముడు లాంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత కాట్రగడ్డ మురారి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, రాఘవేంద్ర రావుతో ఆయనకి తీవ్ర విభేదాలు ఉన్నట్లు అర్థం అవుతోంది. కాట్రగడ్డ మురారి మాట్లాడుతూ.. ఇండస్ట్రీని చెడగొట్టిన వ్యక్తులు ఇద్దరు.. ఒకరు చిరంజీవి.. మరొకరు రాఘవేంద్రరావు.
అసలు ఇండస్ట్రీకి బూతుని పరిచయం చేసింది కూడా వీళ్ళిద్దరే అంటూ మురారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తూ.. హీరోయిన్లతో శృంగారానికి, బూతుకి మధ్య ఉన్న గీతని చెరిపేశారు. శృంగారం కాస్త బూతుగా మార్చేశారు. రాఘవేంద్ర రావు దర్శకత్వం కూడా అలాగే ఉంటుంది. దురదృష్టవశాత్తూ వారిద్దరూ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు అని మురారి తెలిపారు.
రాఘవేంద్ర రావు నిర్మాతలని అసలు గౌరవించే వ్యక్తి కాదు. నాగార్జునతో జానకీరాముడు చిత్రాన్ని మూగమనసులు తరహాలో తీద్దాం అనుకున్నా. రాఘవేంద్ర రావు విజయశాంతిని హీరోయిన్ గా పెట్టి చెడగొట్టారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయనకి డైలాగులు స్పష్టంగా చెప్పడం చేతకాదు.. ఆయన అన్ని భావాలు పలికించలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
చిరంజీవిలో ఒకే ఒక్క పాజిటివ్ విషయం ఉంది.. ఆయన వల్ల ఏ నిర్మాత కూడా నష్టపోలేదు అని మురారి ప్రశంసించారు. అంటే చిరంజీవి సక్సెస్ అయినట్లే కదా అని యాంకర్ ప్రశ్నించగామురారి అవును అని సమాధానం ఇచ్చారు.