‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ప్రీమియర్స్: ఎన్నింటికి మొదలు, ఎక్కడెక్కడ
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. అయితే, మిడ్‌నైట్ స్క్రీనింగ్‌లపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ప్రీ-రిలీజ్ ప్రీమియర్ల ప్రణాళికలకు అంతరాయం ఏర్పడింది. టీం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అన్వేషిస్తోంది.
Pushpa 2, Pre-Release Premieres, sukumar
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప – 2. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ , ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.
సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న పుష్ప -2 డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రీమియర్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తున్నారు. ఆ వివరాలు మీకు అందిస్తున్నాం.
‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా 12,000+ స్క్రీన్లతో భారీ విడుదలకు సిద్ధమవుతోంది. పుష్ప ఆరు భాషల్లో విడుదలవుతోంది. అలాగే ఇప్పుడు అభిమానులను మరింత ఉత్సాహపరచడానికి ప్రీ రిలీజ్ ప్రీమియర్స్ కు రంగం సిద్దం చేస్తోంది.
ఈ క్రమంలో పుష్ప 2 చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది, ఓపెనింగ్ రోజునే ₹250 కోట్లకు పైగా గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా ఉండనున్నట్లు అంచనాలు ఉన్నాయి, ఇది భారతీయ సినిమాకు కొత్త రికార్డు అనే చెప్పాలి. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో తిరిగి వచ్చినప్పటి నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఇది రికార్డు క్రియేటింగ్ విడుదలగా ఉండబోతోంది.
ఇక ప్రతిష్టాత్మకమైన ‘పుష్ప 2: ది రూల్’ ప్రీ రిలీజ్ ప్రీమియర్స్ విషయానికి వస్తే... మొదట్లో చిత్ర నిర్మాతలు అన్ని ప్రధాన ప్రాంతాల్లో రాత్రి 1 గంట నుండి మిడ్‌నైట్ షోలతో వేడుకలను ప్రారంభించాలని ప్లాన్ చేసారు. అయితే, అనుకోని ఛాలెంజ్ లు ఎదరౌతున్నాయి.
దాంతో ఆ ప్లాన్ లను పునఃపరిశీలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మిడ్‌నైట్ స్క్రీనింగ్స్‌ను ఆపాలని చర్యలు తీసుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి, ఇది చిత్ర నిర్మాతల ప్లానింగ్ ను దెబ్బకొడుతోంది.
pushpa 2
అలాగే పుష్ప 2 కొత్త రికార్డులు సెట్ చేయాలనే లక్ష్యంతో అదనంగా, టీం టికెట్ ధరలలో పెంపు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది, . అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలను ఆమోదించడానికి సిద్ధంగా ఉందా లేదా అనే క్లారిటీ లేదు. ఎందుకంటే టిక్కెట్ ధర ఆరు వందలు దాకా అడుగుతున్నట్లు వినికిడి.
Pushpa 2
‘పుష్ప 2’తెలుగు రాష్ట్రాల నుంచి బ్రేక్ ఇవెన్ సాధించడానికి ₹220 కోట్ల షేర్ అవసరం కావడంతో, టీం ఇప్పుడు అందుకు తగ్గ ఏర్పాట్లలో పడింది. ఆ జోరు కొనసాగించడానికి వేరే ప్లాన్ లను అన్వేషిస్తోంది. పుష్ప టీమ్ డిసెంబర్ 4న రాత్రి 10 గంటల నుండి ప్రారంభమైన ప్రీ-రిలీజ్ ప్రీమియర్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది,
ఇవి మిడ్‌నైట్ షోల నుంచి వచ్చే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్లాన్ గా భావించబడుతున్నాయి. ఈ ప్రీమియర్లు తెలుగు రాష్ట్రాలపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా జరగనున్నాయి. నిర్మాతలు దేశవ్యాప్తంగా విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు.