ఇవి కలిపిన దోశ తింటే.. జుట్టు రాలడమనే సమస్యే ఉండదు..!
కేవలం ఒక్క దోశ, చట్నీ కాంబినేషన్ తీసుకుంటే.. జుట్టు రాలడం ఆగిపోగా… ఒత్తుగా పెరుగుతుంది. మరి, ఆ దోశ ఏంటి? ఆ చట్నీ కాంబినేషన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…
మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనే విషయం మన జుట్టు మీద ఆధారపడి ఉంటుంది. మీరు చదివింది నిజమే. మనం ఆరోగ్యంగా ఉంటే జుట్టు బలహీనంగా, కళ తప్పినట్లుగా ఉండదు. మన జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనం మంచి ఆహారం తీసుకుంటే.. జుట్టు కూడా అందంగా ఉంటుంది.
Ragi Dosa
జుట్టు రాలకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో బయోటిన్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటివి కచ్చితంగా ఉండాలి. వీటన్నింటినీ మనం.. కేవలం ఒక్క దోశ, చట్నీ కాంబినేషన్ తీసుకుంటే.. జుట్టు రాలడం ఆగిపోగా… ఒత్తుగా పెరుగుతుంది. మరి, ఆ దోశ ఏంటి? ఆ చట్నీ కాంబినేషన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…
జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే దోశ తయారీకి కావాల్సినవి ఏంటో చూద్దాం… సాధారణంగా మనం దోశ పిండి కోసం మినపప్పు, బియ్యం వాడతాం. కానీ.. అవి కాకుండా రాగులు, శెనగలు, పెరుగు వాడాలి. ఇక చట్నీ కోసం కొబ్బరి వాడితే చాలు. ఈ నాలుగు ఆహారాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో మనకు సహాయపడతాయి.
Ragi Dosa
ఐరన్, కాల్షియం, అమినో యాసిడ్ ల వంటి ముఖ్యమైన పోషకాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి తలకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని వల్ల జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. జుట్టురాలడాన్ని తగ్గిస్తుంది.
Instant Ragi Dosa
2. చిక్‌పీస్‌లో ప్రోటీన్ , జింక్ అధికంగా ఉంటుంది, చిక్‌పీస్ హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది బలమైన, ఆరోగ్యకరమైన జుట్టుకు మద్దతు ఇస్తుంది.
3.పెరుగులో ప్రోబయోటిక్స్ , ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడానికి కారణమయ్యే చుండ్రు ,మంటను తగ్గిస్తుంది.
4. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, కొబ్బరి జుట్టు తంతువులను బలపరుస్తుంది, విరిగిపోకుండా, తేమను అందిస్తుంది.
Ragi Dosa
మరి, ఈ దోశ చట్నీ ఎలా తయారు చేయాలంటే…
నార్మల్ గా మీకు రాగిదోశ తయారు చేయడం వస్తే… అదేవిధంగా దీనిని తయారు చేసుకోవచ్చు. చట్నీ తయరీలో కూడా కొబ్బరితో పాటు శెనగలు, పెరుగు వాడొచ్చు. ఈ రెండూ కలిపి తయారు చేసుకున్న దోశ తింటే.. మీ జుట్టు చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది.
దోశ, చట్నీ తయరీ విధానం లింక్ కోసం క్లిక్ చేయండి..