తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్: వైట్ ఛాలెంజ్‌కి సిద్దమా అంటూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు
తెలంగాణ రాస్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ టూర్ పై టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రాహుల్ గాంధీ వైట్ చాలెంజ్ కి సిద్దమా అని టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: Telangana రాష్ట్రంలో Congress పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi టూర్ పై TRS, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ నేతలు వైట్ ఛాలెంజ్ ను విసిరారు. గతంలో తెలంగాణ మంత్రి KTR కి టీపీసీసీ చీఫ్ రేRevanth Reddy వైట్ ఛాలెంజ్ విసిరారు.
ఈ నెల 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 6వ తేదీన New Delhi నుండి రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన నేరుగా వరంగల్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనేందుకు వెళ్తారు. ఈ నెల 7న హైద్రాబాద్ లో పలు కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో కూడా రాహుల్ గాంధీ పాల్గొంటారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, నేతలతో రాహుల్ గాంధీ పోటోలు దిగుతారు.
రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ను పురస్కరించుకొని టీఆర్ఎస్ రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తుంది. నేపాల్ లో ఓ వివాహానికి హాజరైన రాహుల్ గాంధీ నైట్ క్లబ్ లో ఉన్న వీడియోలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వీడియోపై BJP తీవ్ర విమర్శలు చేసింది. ఈ వీడియో వెలుగు చూసిన తర్వాత వైట్ ఛాలెంజ్ కి రాహుల్ గాంధీ సిద్దమా అంటూ TRS నేతలు ఫ్లెక్సీలు కట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో Drugs కేసులు బయటకు వచ్చిన సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2021 సెప్టెంబర్ 18న వైట్ ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కూడా ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి ఈ సవాల్ విసిరారు. ఈ విషయమై గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన కేటీఆర్ కూడా స్పందించారు. రాహుల్ గాంధీ డ్రగ్స్ టెస్ట్ కి సిద్దమైతే తాను కూడా ఢిల్లీలోని AIIMS లో డ్రగ్స్ టెస్టు చేయించుకొంటానని కూడా కేటీఆర్ ప్రకటించారు అంతేకాదు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్దమా అని కూడా కేటీఆర్ ప్రశ్నించారు.
వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధకారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహాకర్తగా సునీల్ ను నియమించుకొంది కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీకి సునీల్ నివేదికను ఇచ్చారు. తెలంగానకు చెందిన పార్టీ నేతలు గత మాసంలో రాహుల్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత తెలంగాణలో రాహుల్ ను పర్యటించాలని కోరారు. వీలైనన్నీ ఎక్కువ సార్్లు పర్యటిస్తానని రాహుల్ కూడా హామీ ఇచ్చారు.
ఈ నెల 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారు.ఈ పర్యటన పూర్తైన తర్వాత రాహుల్ గాంధీ టూర్ కి ఆ పార్టీ ప్లాన్ చేయాలని భావిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువ గా పార్టీ సభ్యత్వం చేయించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.