తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. భైంసా వేధికగా జరిగిన బహిరంగ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ ప్రచార సభలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ...టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల వర్షం కురింపించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులంటే అసలు ప్రేముందా అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదని ఉత్తమ్ విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిమరీ ఆత్మహత్యలు చేసుకున్న 15మంది రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ  గ్రామాలన్ని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వున్నా రాహుల్ అక్కడికి చేరుకోడానికి వెనుకాడలేదని ఉత్తమ్ గుర్తుచేశారు. 

ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాపీ ఏకకాలంలో చేయనున్నట్లు మరోసారి గుర్తుచేశారు. తమ హామీలకు ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడి ఉంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పదికి పది స్థానాలు గెలిచి తీరతామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ బృతి ఇవ్వడంతో పాటు ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న హామీలను మరోసారి ఉత్తమ్ గుర్తుచేశారు. 

ఈ సభలో కాంగ్రెస్ ప్రచారకమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో పోరాటం పార్టీల మధ్య కాదని ప్రజలకు, దొరలకు మధ్య జరుగుతోందన్నారు. అందువల్ల ప్రజల పక్షాన నిలిచే కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజా పాలన తీసుకురావాలని ఉత్తమ్ ప్రజలకు సూచించారు. ఈ గెలుపు  ఆదిలాబాద్ నుండే ప్రారంభం కావాలన్నారు. భూస్వాముల మీద పోరాటం చేసిన కొమురం భీం, పొడుస్తున్న పొద్ద మీద వంటి విప్లవ గీతాలను రచించిన గద్దర్, దొర ఏందిరో అంటూ పాట పాడిన అంజయ్య పుట్టిన నేల ఆదిలాబాద్ అని భట్టి గుర్తుచేశారు. వారి ఆశయాలను అనుగుణంగా ఇక్కడి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని భట్టి ప్రజలను కోరారు. 
 

సంబంధిత వార్తలు

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?