టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అరెస్ట్ తెలంగాణలో సంచలనం కలిగించింది. ఇది అక్రమ అరెస్ట్‌ అని ఎన్నికల సంఘం కేసీఆర్ కనుసన్నుల్లో పనిచేస్తుందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు.

సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన...కేసీఆర్ సభను అడ్డుకుంటామని డిసెంబర్ 2న రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు తనకు ఫిర్యాదు చేశారని... ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించామని రజత్ తెలిపారు.

సీఈసీ ఆదేశాల మేరకు తాను రిటర్నింగ్ అధికారికి, జిల్లా ఎన్నికల అధికారికి లేఖలు రాశానని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని తాను వారిని కోరానని.. దీనిలో భాగంగానే ఈ తెల్లవారుజామున రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని రజత్ కుమార్ వెల్లడించారు.

ఎన్నికల సంఘం దృష్టిలో అన్ని పార్టీలు ఒకటేనని... ప్రస్తుతం కొడంగల్‌లో మాత్రమే స్వల్పంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. తెలంగాణ అంతటా ప్రశాంతంగా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయని... ఎవరికైనా ప్రచారం చేసుకొనే అవకాశం, స్వేచ్ఛ కల్పిస్తామని రజత్ కుమార్ తెలిపారు.
 

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్