తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులతో చర్చిస్తున్నారు.

Also Read:గాంధీ ఆస్పత్రి వ్యవహారంపై మంత్రి ఈటెల రాజేందర్ సీరియస్

ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు పౌరసత్వ సవరణ చట్టంపై ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలతో పాటు మరికొన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఈ రెండు శాఖల్లో సుమారు 2 వేలకు పైగా ఖాళీలున్నట్లుగా తెలుస్తోంది. కొత్త పాలనా సంస్కరణలు, కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించి దానికి తుదిరూపు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Also Read:సహకార సంఘ ఎన్నికలు.. టీఆర్ఎస్ నేత దారుణ హత్య

దీనితో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే వీలుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్చి మొదటి వారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.