Asianet News TeluguAsianet News Telugu

స్పా సెంటర్లలో క్రాస్ మసాజ్ ముసుగులో వ్యభిచారం.. బంజారాహిల్స్ లో నాలుగు కేంద్రాలు సీజ్..

స్పా సెంటర్ల ముసుగులో మెయిన్ రోడ్డులోనే వ్యభిచారం నిర్వహిస్తున్నాయి కొన్ని స్పా సెంటర్లు. థాయ్ లాండ్ నుంచి అమ్మయిలను తీసుకువచ్చి క్రాస్ మసాజ్ పేరుతో ఈ పనులకు పాల్పడుతున్నాయి. 

Prostitution under cross massage in spa centers In Banjara Hills, hyderabad - bsb
Author
First Published Feb 7, 2023, 9:08 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో వ్యభిచార ముఠాలపై  పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. పోలీసులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వ్యభిచార గృహాలు రకరకాల పేర్లతో నడుస్తూ సవాలుగా మారుతున్నాయి. తాజాగా స్పా పేరుతో క్రాస్ మసాజ్ చేస్తూ.. వ్యభిచార గృహాలుగా మారిన నాలుగు స్పాల మీద బంజారా హిల్స్ పోలీసులు దాడులు చేశారు. స్పా ముసుగులో నడుస్తున్న ఈ గృహాల నిర్వాహకులను అరెస్టు చేశారు. ఈ స్పాలలో వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులను  పునరావాస కేంద్రాలకు పంపించారు.

షాకింగ్ విషయం ఏంటంటే ఈ స్పాలు అన్ని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని మెయిన్ రోడ్ లోనే ఉండడం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఈ స్పాల వివరాలు ఇవి. కృష్ణ టవర్లో స్పా పేరుతో కొనసాగుతున్న ఔరం సెలూన్ అండ్ స్పా, కిమ్తి స్వేర్ లోని ఎఫ్ 2 లగ్జరీ థాయ్ స్పా, రోడ్ నెంబర్ 12 లోని అధర్వ హమామ్ స్పా, బంజారా గార్డెన్ బిల్డింగ్ లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలపై పోలీసులు  దాడులు చేశారు.

అంతా డొల్లే.. చివరి ఏడాదీ మొండిచేయే, పిల్లలకు మళ్లీ పురుగుల అన్నమే : బడ్జెట్‌పై బండి సంజయ్ విమర్శలు

పోలీసుల దాడుల్లో ఈ స్పాలలో మసాజ్ థెరపిస్టులు పేరుతో కొంతమంది అమ్మాయిలను నియమించుకుంటున్నారని.. వారితో  క్రాస్ మసాజ్ లకు పాల్పడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా తేలింది. ఈ సెలూన్ అండ్ స్పాలను నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నట్లు తేలడంతో వీటిని సీజ్ చేసి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఔరం సెలూన్ అండ్ స్పాలో థాయిలాండ్ నుంచి ఐదుగురు యువతులను రప్పించి వీరికి మసాజ్ థెరపిస్ట్ అనే పేరు పెట్టారు. వీరితో క్రాస్ మసాజ్ చేయిస్తున్నట్లుగా పోలీసుల తనిఖీల్లో తేలింది.

దీంతో ఈ థాయిలాండ్ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఔరం సెలూన్ అండ్ స్పా మేనేజర్ సమీర్ మీద కేసు నమోదు చేశారు. ఈ స్పా నిర్వాహకుడు జంగం సుధాకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అధర్వహమామ్ స్పా మేనేజర్ యామిన్ జిలాని, యజమాని భీమ్ సింగ్ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా  స్పాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు.. కస్టమర్ ఎంట్రీ రిజిస్ట్రేషన్ కూడా లేదు.. దీంతోపాటు జిహెచ్ఎంసి ట్రేడ్ లైసెన్స్ వీటికి లేవు. ఇవేవీ లేకుండానే స్పాలను నిర్వహిస్తున్నట్లుగా బంజారా హిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios