నేను చైనాకు పెద్ద ఫ్యాన్నీ ! ప్రధానిని కలిసిన తర్వాత ఓపెన్ టాక్!

ఎలోన్ మస్క్ మాట్లాడుతూ, "నేను చైనాకు పెద్ద అభిమానిని, నాకు చైనాలో కూడా చాలా మంది ఫ్యాన్స్  ఉన్నారు. మేము కూడా అదే భావాలను పంచుకుంటాము."అని అన్నారు. 
 

I am a big fan of China! Elon Musk Open Talk after meeting the Chinese Prime Minister!-sak

చైనా వెళ్లిన టెస్లా సీఈవో ఎలోన్ మస్క్  తాను చైనాకు పెద్ద ఆభిమానినని అన్నారు. భారత్ పర్యటనను వాయిదా వేసుకుని చైనా వెళ్లిన  సందర్భంగా ఆయన ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా  చైనాలో పర్యటించి ఆ దేశ ప్రధానితో చర్చలు జరిపారు.

ఎలాన్ మస్క్ ఆదివారం చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. అక్కడ అతను టెస్లా ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ కార్ సాఫ్ట్‌వేర్ లాంచ్  గురించి చైనా అధికారులతో చర్చలు జరిపాడు.

దీనిపై ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఎలోన్ మస్క్.. "చైన రాజకీయ నాయకుడు లీ కియాంగ్‌ను కలవడం నాకు గౌరవంగా ఉంది. మేము ఒకరికి ఒకరం మొదటి నుండి చాలా సంవత్సరాలుగా తెలుసు."

"నేను చైనాకు పెద్ద ఆభిమానిని అని చెప్పాలి. నాకు చైనాలో కూడా చాలా మంది ఫ్యాన్స్  ఉన్నారు. మేము కూడా అదే భావాలను పంచుకుంటాము" అని ఎలోన్ మస్క్ అన్నారు.

2018లో యునైటెడ్ స్టేట్స్ బయట మొదటిసారిగా షాంఘైలో కార్ల తయారీ కర్మాగారాన్ని స్థాపించడానికి టెస్లా చైనా అధికారులతో ఒప్పందంపై సంతకం చేసింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లను అక్కడి ఫ్యాక్టరీ నుంచి ఎగుమతి చేస్తారు.

టెస్లా ప్రారంభమైనప్పటి నుండి చైనాలో 1.7 మిలియన్లకు పైగా కార్లను విక్రయించింది. అలాగే, టెస్లా కార్లు చైనా నుండి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇంకా  యూరప్‌లకు ఎగుమతి చేస్తుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios