ఫిజియో థెరపీ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఖైరతాబాద్‌లోని  ఫిజియోథెరపీ క్లినిక్‌ పేరుతో మసాజ్‌ సెంటర్‌ సాగిస్తున్నారు.

అయితే కొద్దిరోజులుగా అక్కడ కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా ప్లాన్‌‌తో ఓ కానిస్టేబుల్‌ను మఫ్టీలో క్లినిక్‌కు పంపారు.

అనంతరం కానిస్టేబుల్‌ వారికి డబ్బులిస్తుండగా పోలీసులు దాడి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫిజియోథెరపీ సెంటర్‌ నిర్వాహకురాలితో పాటు, ఇద్దరు యువతులు, మరో నలుగురు విటులను అరెస్ట్‌ చేశారు.