తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, మహాకూమి నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేవలం మాటలే కాదు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేంత వరకు ఇద్దరి మధ్య వివాదం చెలరేగుతోంది. టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమపై అనవసర దాడులు చేయిస్తోందని ఉత్తమ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మహాకూటమి నాయకలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

గురువారం తెలంగాణ సీఈవో రజత్ కుమార్ ను ప్రజాకూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, కపిలవాయి తదితరులు కలిశారు. కూటమి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని నాయకులు ఆయనకు ఫిర్యాదు చేశారు. అలాగే విపక్ష నేతల వాహనాలను తనిఖీలు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించని నాయకులపై, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదే అంశంపై ఇవాళ ఉదయం టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌ల మధ్య సోషల్ మీడియా వేధికన వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. కేటీఆర్‌కు బంధువులయిన డీఐజీ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ అధికారి రాధాకృష్ణరావులతో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా పనిచేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. వీరిద్వారా కేవలం కాంగ్రెస్ నాయకుల వాహనాలపై తనిఖీల పేరుతో దాడులు చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిచిన కేటీఆర్ పోలీస్ అధికారుల గురించి అలా దిగజారి మాట్లాడవద్దంటూ నిప్పులు చెరిగారు.
మరిన్ని వార్తలు
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి