Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో 14 కిలోల డ్రగ్స్ సీజ్: అస్ట్రేలియాకు తరలిస్తుండగా పట్టివేత

హైద్రాబాద్ లో మరోసారి డ్రగ్స్తత బయటపట్టాయి. బేగంపేటలోని ఓ పార్శిల్స్ సంస్థలో రూ. 5.5 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. హైద్రాబాద్ నుండి అస్ట్రేలియాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్గించారు.

Police seized 14 kgs Drugs seized at Begumpet in Hyderabad
Author
Hyderabad, First Published Nov 11, 2021, 3:42 PM IST


హైదరాబాద్: హైద్రాబాద్ బేగంపేటలో 14 కిలోల డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ రూ. 5.5 కోట్ల వలువ ఉంటుందని పోలీసుల తెలిపారు. ఫోటో ప్రేమ్స్ వెనుక డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.హైద్రాబాద్ నుండి అస్ట్రేలియాకు  డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బేగంపేటలోని ఇంటర్నేషనల్  పార్శిల్ కార్యాలయంలో పోలీసులు గురువారం నాడు సోదాలు చేసి భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. గత మాసంలో సీఎం కేసీఆర్ ఎక్సైజ్, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కేసీఆర్ కీలక ఆదేశాలిచ్చారు. గంజాయి అక్రమ సరఫరాతో పాటు డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Hyderabad నుండి Australiaకు 300 కేజీల  Drugs ను సరఫరా చేసినట్టుగా హైద్రాబాద్ పోలీసులు తెలిపారు.Driతో కలిసి హైద్రాబాద్ నార్త్ జోన్ పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేసి ఈ డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇండియాకు చెందిన ప్రముఖ పర్యాటక స్థలాలు,ప్రముఖుల ఫోటోల ఫ్రేమ్ వెనుక 800 గ్రాములు డ్రగ్స్ ను ఉంచి అస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నారు. ఈ విషయమై పార్శిల్ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఈ సమాచారం మేరకు పోలీసులు ఈ సంస్థపై సోదాలు నిర్వహించారు. 25 Photo frames 11 ఫ్రేముల్లో డ్రగ్స్ ను గుర్తించారు.గతంలో చిన్న పిల్లల ఆట వస్తువులు, మహిళల బ్యూటీషీయన్ వస్తువులతో కలిపి డ్రగ్స్ ను అస్ట్రేలియాకు పంపారు. హైద్రాబాద్ నుండి అస్ట్రేలియాకు 14  పార్శిళ్ల ద్వారా 300 కిలోల డ్రగ్స్ ను సరఫరా చేశారని పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ధరావత్ సాయి చరణ్ సహా మరో ఇధ్దరిని అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 

also read:మేడ్చల్ డ్రగ్స్ కేసు: ప్రధాన నిందితుడు ఎస్‌కె రెడ్డి లొంగుబాటు

డ్రగ్స్  విషయమై ప్రత్యేకంగా డీజీ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామని సీఎం కేసీఆర్ ఆదేశించారు.ఈ ఏడాది అక్టోబర్ 23న మేడ్చల్ లో రూ. 2 కోట్ల విలువైన డ్రగ్స్ నుఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో పలువురిని  ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ కే రెడ్డి రెండు రోజుల క్రితం ఎల్‌బీ నగర్ కోర్టులో లొంగిపోయాడు.  ఈ ఏడాది అక్టోబర్ 19న అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ పోలీసులు తెలిపారు.వానపల్లి నాగసాయి అనే అంతరాష్ట్ర నార్కోటిక్ డ్రగ్స్ వ్యాపారిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.

 గత నెల చివరి వారానికి హైద్రాబాద్ సిటీ పోలీసులు  128 మంది డ్రగ్స్ వ్యాపారులను అరెస్ట్ చేశారు. 24 మందిపై పీడీ కేసులు పెట్టారు. హైద్రాబాద్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రిపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు వీదేశీయులను కూడా అరెస్ట్ చేశామని హైద్రాబాద్ పోలీసులు తెలిపారు. 1500 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios