హైద్రాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ జైన్ అరెస్ట్: రూ. 3.71 కోట్లు స్వాధీనం

హైద్రాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ జైన్ ను ఎన్‌సీబీ అధికారులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంట్లో నుండి రూ. 3.71 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

NCB Arrested International Drugs Peddler Ashish Jain In Hyderabad

హైదరాబాద్: హైద్రాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారం పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. Ashish Jain ఇంట్లో NCB అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో రూ. 3.71 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. అమెరికాతో పాటు పలు విదేశాలకు  డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించారు. Pharrmacy  ముసుగులో ఆశీష్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని  ఎన్‌సీబీ గుర్తించింది., బిట్ కాయిన్, క్రిఫ్టో కరెన్సీ ద్వారా లావా దేవీలు జరిగాయని కూడా అధికారులు గుర్తించారు.

ఇంటర్ నెట్ పార్మసీ, జీఆర్ ఇన్‌పీనిటీ పేరుతో ఆశీష్ జైన్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించింది. గత రెండేళ్లలో వెయ్యికి పైగా విదేశాలకు ఆర్డర్లు పంపిన విషయాన్ని కూడా ఎన్సీబీ గుర్తించింది.

న్యూఢిల్లీకి చెందిన ఎన్సీబీ అధికారుల బృందం హద్రాబాద్ లోని హిమాయత్ నగర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో డ్రగ్స్ ను కూడా సీజ్ చేశారు.ఆశీష్ జైన్ సింథటిక్ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ నెల 5వ తేదీన ఎన్సీబీ అధికారులతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు కూడా హైద్రాబాద్ నగరంలో మూడు చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఆశీష్ జైన్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇంటర్నెట్ సహాయంతో విదేశాలకు ఫోన్ కాల్స్ వెళ్తున్న విషయాన్ని గుర్తించిన న్యూఢిల్లీ ఎన్సీబీ అధికారులు ఆశీష్ జైన్ పై నిఘాను ఏర్పాటు చేశారు.డ్రగ్స్ ను విదేశాలకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న విషయాన్ని ఎన్సీబీ అధికారులు గుర్తించారు. వెంటనే ఎన్సీబీ అధికారులు హైద్రాబాద్ లోని ఆశీష్ జైన్ ఇంటిపై దాడి చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సీటీగా మార్చాలని  కేసీఆర్ సర్కార్ కంకణం కట్టుకుంది. ఎక్సైజ్, పోలీసు అధికారులతో కేసీఆర్ ఇటీవల కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో  అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పోలీసు, ఎక్సైజ్ అధికారలుు నిఘాను మరింత ముమ్మరం చేశారు. హైద్రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ సరఫరా చేసే వారి అరెస్ట్ లు పెరిగాయి. ముంబై లో ఉంటూ దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న టోనిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టోనితో పాటు టోని నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.డ్రగ్స్ తో పాటు గంజాయిని సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు పోలీసులు.

హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను తరలిస్తున్నవారిని అధికారులు అరెస్ట్ చేశారు. కడపులో క్యాప్సూల్స్  తరలిస్తున్న ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు. అంతేకాదు ట్రావెల్ బ్యాగుల్లో డ్రగ్స్ ను తరలిస్తున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.విదేశాల నుండి వచ్చే వారితో పాటు నగరంలో కూడా పలువురు డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిని గుర్తించి అరెస్ట్ చేశారు. గంజాయి, హాష్ ఆయిల్  సరఫరా చేసే వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios