Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి, పైరవీలు, దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారు.. మంత్రి జగదీష్ రెడ్డి

కేసీఆర్ కాళేశ్వరం కల సాకారం చేసిన నేత అని.. సంక్షేమం, అభివృద్ధిలో సంచలనాలు సృష్టించిన నాయకుడని చెప్పుకొచ్చారు. పైరవీలు, దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు.

minister jagadish reddy comments
Author
Hyderabad, First Published Jan 29, 2022, 2:15 PM IST

హైదరాబాద్ : ముఖ్యమంత్రి KCR నిప్పులాంటి వ్యక్తి అని.. ఆయన్ని ముట్టుకుంటే భస్మం అవుతారని మంత్రి Jagdish Reddy విరుచుకుపడ్డారు. TRS పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల అభినందన సభలో ముఖ్య అతిధిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

కేసీఆర్ కాళేశ్వరం కల సాకారం చేసిన నేత అని.. సంక్షేమం, అభివృద్ధిలో సంచలనాలు సృష్టించిన నాయకుడని చెప్పుకొచ్చారు. పైరవీలు, దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. 29 రాష్ట్రాలలో అతి చిన్న రాష్ట్రం తెలంగాణ అని.. అయినా సంక్షేమం, అభివృద్ధి లో పరుగులు పెడుతున్న రాష్ట్రం అని అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే 24 గంటల విద్యుత్ ఉండేదా? ఇంటింటికి మంచినీరు అందేదా? దళారులకు దోచి పెట్టడం వారితో అంట కాగడం తప్ప? అని నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో దారిద్ర్య రేఖ మరింత పెరిగింది.మోడీ పాలనలో దళారులు కుబేరులైనారు. దేశం దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. 
కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేదు. పార్టీని నడిపే నాయకుడు ఎవరో వారికే  తెలీదు. సొంత పార్టీకి నాయకుడు ఎవరో వారికే తెలియదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అటువంటి పార్టీలు పేలుతున్న పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

మాదంతా పారదర్శకమే. మ్యానిఫెస్టోను ఉన్నది ఉన్నట్లు అమలు పరిచిన ఏకైక పార్టీ టిఆర్ యస్ అని చెప్పుకొచ్చారు. ఎక్కడ చర్చకైనా గులాబీ శ్రేణులు సిద్ధమేనన్నారు. డెబ్బయి ఏళ్లుగా జరగని అభివృద్ధి ఏడేళ్లలో 75%పూర్తి చేసి చూపించిన ఘనత టీఆర్ఎస్ దేనన్నారు. 

టి ఆర్ యస్ పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువని, అటువంటి పార్టీలో సభ్యత్వం పొందడమే గౌరవం అన్నారు. నిబద్ధతే గుర్తింపు నిస్తుందన్నారు. ఆ నిబద్ధత తోటే బడుగులకు పదవులని చెప్పుకొచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి. 

ఇదిలా ఉండగా, జనవరి 26న TRS జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ బుధవారం నాడు ప్రకటించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నూతన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపిక విషయమై KCR కు అధికారమిస్తూ గతంలో పార్టీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

19 మంది MLAలను జిల్లా అధ్యక్లులుగా కేసీఆరి నియమించారు. అంతేకాదు ముగ్గురు MPలకు కూడా జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చారు. ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మెన్లకు కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు కేసీఆర్. ఇద్దరు MLలకు కూడా జిల్లా పార్టీ పగ్గాలు దక్కాయి.

Follow Us:
Download App:
  • android
  • ios