విషం తాగి, ఆ తర్వాత చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

love couples suicide in jagityala district
Highlights

జగిత్యాల జిల్లాలోని నల్లగొండగుట్టపై దారుణం...

వారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లి ఆనందంగా బ్రతకాలనుకున్నారు. అయితే వీరి పెద్దలు మాత్రం వీరికి పెళ్లి చేయడానికి అంగీకరించలేదు. ఇక ఎలాగూ కలిసి బ్రతలేమని తెలుసుకున్న వారు కలిసి చావడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి ఊరికి దూరంగా పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, గౌతమిలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను కుటుంబసభ్యులకు తెలిపి పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమజంట బావించింది. అయితే వీరికి పెళ్లి చేయడానికి ఇరువుని కుటుంబసభ్యులు తిరస్కరించారు. అంతే కాకుండా గౌతమి కుటుంబసభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు.

దీంతో ఇక తమ పెళ్లి జరగదని భావించిన వీరు కలిసి చనిపోడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి తమ గ్రామం నుండి పారిపోయి జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని నల్లగొండగుట్టపైకి చేరుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మొదట తమతో తెచ్చుకున్న విషం తాగారు. అయితే అది పనిచేయకపోవడంతో ఇద్దరూ కలిసి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు.

మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్ఘలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
  
 

loader