Asianet News TeluguAsianet News Telugu

ఆ 14 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు కేసీఆర్ కసరత్తు, అదృష్టం ఎవరిదో?

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ నెల 10వ తేదీ తర్వాత మిగిలిన 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

kcr plans to announce 14 candidates after oct 10
Author
Hyderabad, First Published Oct 7, 2018, 12:32 PM IST

హైదరాబాద్:  తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ నెల 10వ తేదీ తర్వాత మిగిలిన 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.  సెప్టెంబర్ 6వ తేదీనే  105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్... మిగిలిన 14 స్థానాల్లో కూడ  అభ్యర్థులను ప్రకటించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని రాజకీయపార్టీలు  తమ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. 

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను  కేసీఆర్  105 స్థానాల్లో పోటీ చేసే  టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.  తెలంగాణలోని బీజేపీ అభ్యర్థులు ప్రాతినిథ్యం వహిస్తున్న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట, గోషా మహల్ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కొండా సురేఖ, బొడిగె శోభ, మేడ్చల్ నుండి సుధీర్ రెడ్డి లకు  తొలి జాబితాలో టిక్కెట్టు దక్కలేదు.  తొలి జాబితాలో టిక్కెట్టు దక్కని కారణంగా  కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొడిగె శోభ ఇంకా టీఆర్ఎస్ టిక్కెట్టుపై  నమ్మకంతో ఉన్నారు.  ఆంథోల్ టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే బాబు‌మోహన్‌కు బదులుగా జర్నలిస్ట్ నేత క్రాంతికి కేటాయించారు.దీంతో బాబుమోహన్ బీజేపీలో చేరారు.

ఇక కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌లో, ఆయన సతీమణి ప్రాతినిథ్యం వహిస్తున్న కోదాడలో కూడ అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించలేదు.  వికారాబాద్ స్థానానికి కూడ అభ్యర్ధిని కేసీఆర్ ప్రకటించలేదు.

అయితే ఈ పెండింగ్ స్థానాల్లో  అభ్యర్థులను ప్రకటించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.ఈ తరుణంలో కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అభ్యర్థులను ప్రకటించని 14 స్థానాల్లో ఈ నెల 10వ తేదీ తర్వాత అభ్యర్థులను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్  విడుదల కావడంతో టీఆర్ఎస్ కూడ తన ప్రచారాన్ని  మరింత ముమ్మరం చేయాలని భావిస్తోంది
 

సంబంధిత వార్తలు

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్

డికె అరుణ బండారం బయటపెడతా: స్వరం పెంచిన కేసీఆర్

డిఫెన్స్‌లో కేసీఆర్: చంద్రబాబు టార్గెట్ అందుకే...

చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్

చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్

టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం

Follow Us:
Download App:
  • android
  • ios