నల్గొండ: నేను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబునాయుడు నీ గతి ఏమౌతోందో ఆలోచించుకోవాలని  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా కూటమా..మహా కాలకూట విషమా అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు.

గురువారం నాడు నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో  మరోసారి చంద్రబాబునాయుడుపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. టీడీపీతో కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకొందని కేసీఆర్ విమర్శించారు.

 

చంద్రబాబునాయుడు  మాతోని గెలుక్కొని ....  విజయవాడ కరకట్ట వద్ద పడ్డావని కేసీఆర్ ఎద్దేవా చేశాడు. తాను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు గతి ఏమౌతోందో ఆలోచించుకోవాల్ననారు. చంద్రబాబునాయుడు బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడని... కేసీఆర్ చెప్పారు. 

చంద్రబాబునాయుడు నయవంచకుడు,, నమ్మదగిన వ్యక్తి కాదన్నారు. మాతో పెట్టుకొంటే ఖబడ్దార్ అంటూ కేసీఆర్ హెచ్చరించారు. చంద్రబాబునాయుడు దుర్మార్గపు పాలనను  తెలంగాణ ప్రజలు మరవలేదన్నారు. 

తెలుగు ప్రజలంతా ఒక్కటేనని చెబుతూ చంద్రబాబునాయుడు కుట్రలు పన్నుతున్నారని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము టీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తామని ఆనాడు తమతో అసదుద్దీన్ ఓవైసీ అండగా నిలిచాడని చెప్పారు.

సంబంధిత వార్తలు

టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?