Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నేరుగా గురి పెట్టి ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబును టార్గెట్ చేసుకుని కేసిఆర్ గురువారం నల్లగొండ ఆశీర్వాద సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు.

KCR reveals Chandrababu hand in cash for vote
Author
Nalgonda, First Published Oct 4, 2018, 9:39 PM IST

హైదరాబాద్: ఓటుకు నోటు కేసును తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు మరోసారి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నేరుగా గురి పెట్టి ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబును టార్గెట్ చేసుకుని కేసిఆర్ గురువారం నల్లగొండ ఆశీర్వాద సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. 

తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాగానే కుట్ర మొదలుపెట్టి అస్థిర పరచి.. గడి బిడ చేయాలని చూశాడని, కుట్రలు పూని ఓటుకు నోటుతో పడగొట్టాలనే ప్రయత్నం చేశాడని, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ తనకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడని కేసిఆర్ అన్నారు. 

"సార్.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది.. నేను రేపొద్దున హైదరాబాద్‌కు వస్తున్నాను రాగానే వచ్చి కలుస్తాను టైమివ్వండి"  అని ఓవైసీ ఫోన్‌లో చెప్పాడని ఆయన అన్నారు. ఇన్ని రోజులూ తెలంగాణ కోసం మీరొక్కరే కొట్లాడారని, ఈ ప్రభుత్వం ఉండాలి కూలిపోవద్దని, రేపే మజ్లిస్ పార్టీ కూడా మీ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తుందని, ఇవాళ్టి నుంచి మనిద్దరం కలిసి తెలంగాణ కోసం కొట్లాడదామని ఓవైసీ అన్నారని కేసిఆర్ వివరించారు.

ఆ మరుసటి రోజు తెల్లారి వాళ్ల పార్టీ ఆఫీసులో అసదుద్దీన్ మీటింగ్ పెట్టి డిక్లేర్ చేశారని, ఆ తర్వాత బీఎస్పీ నుంచి వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి, కూనప్ప వచ్చి పార్టీలో కలిశారని, ఆ తర్వాత వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు పార్టీలోకి వచ్చారని ఆయన అన్నారు. 

దాంతో టీఆర్ఎస్ సంఖ్య 75కి వెళ్లిందని,  ఆ తర్వాతే తెలంగాణలో కుట్రలు ఆగిపోయాయని, అలాంటి కుట్రదారుడు చంద్రబాబును తీసుకొచ్చి ఈ రోజు ఊరేగిద్దామని కొందరు అనుకుంటున్నారని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్

టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

Follow Us:
Download App:
  • android
  • ios