Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన సందర్భంలో కేసిఆర్ చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబూ... పట్టపగలు దొంగలాగా దొరికనవ్... నిన్న బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు" అని కేసిఆర్ అన్నారు. 

KCR again raises Chandrababu's name in cash for vote case
Author
Nizamabad, First Published Oct 3, 2018, 5:49 PM IST

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఓ వైపు కాంగ్రెసు నేత, గత తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిని ఐటి అధికారులు హైదరాబాదులో విచారిస్తుండగా, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిజామాబాద్ ప్రజాశీర్వాద సభలో ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన దొంగగా చంద్రబాబును ఆయన అభివర్ణించారు. 

ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన సందర్భంలో కేసిఆర్ చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబూ... పట్టపగలు దొంగలాగా దొరికనవ్... నిన్న బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు" అని కేసిఆర్ అన్నారు. దీంతో చంద్రబాబు ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కోక తప్పదనే వాతావరణం ఏర్పడింది. 

అయితే, క్రమంగా ఓటుకు నోటు కేసు వెనక్కి వెళ్లింది. కేసిఆర్, చంద్రబాబుల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ సయోధ్య కుదిర్చారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసిఆర్ వెళ్లారు.  బిజెపితో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్న తర్వాత రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారిపోయాయనే అభిప్రాయం ఉంది.

కేసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపికి దగ్గరయ్యారు. చంద్రబాబు బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్న రేవంత్ రెడ్డిని, ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న ఉదయసింహ, సెబాస్టియన్ లను ఐటి అధికారులు ప్రశ్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 

తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలోనే వారి విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ కూడా రికార్డు అయినట్లు వార్తలు వచ్చాయి. ఆయన పేరును తెలంగాణ ఎసిబి పలు మార్లు తన ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించింది. దీంతో చంద్రబాబు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. 

ఓ వేపు రేవంత్ రెడ్డి, ఇతర నిందితుల విచారణ జరుగుతుండగా కేసిఆర్ ఈ కేసులో చంద్రబాబు పేరు ప్రస్తావించడం దేనికి సంకేతమనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబుకు కూడా ఓటుకు నోటు కేసు చుట్టుకుంటుందా అనే సందేహం కలుగుతోంది. అసలు రేవంత్ రెడ్డి విచారణే చంద్రబాబును లక్ష్యంగా సాగుతోందనే అభిప్రాయం ఐటి దాడులు జరిగినప్పుటి నుంచి వ్యక్తమవుతూ వస్తోంది. 

సంబంధిత వార్తలు

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

ఆస్తుల కేసు: ఐటీ అధికారుల విచారణకు కాసేపట్లో రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ చుట్టూ ఉచ్చు: ఉప్పల్ లో తేలిన ఉదయసింహ ఫ్రెండ్ రణధీర్

ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

Follow Us:
Download App:
  • android
  • ios