ఎప్పుడూ ఎవ్వరూ ఊహించని నిర్ణయాలు తీసుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఖమ్మంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించాలని నిర్ణయించిన సీఎం అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ముందుగా హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు.

అనంతరం నిన్న నిజామాబాద్‌లో ప్రచారం చేశారు. దీనిలో భాగంగా ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 8న ఖమ్మంలో మరో సభ నిర్వహించాలని భావించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ అనంతరమే సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఆ సభలను రెండు నియోజకవర్గాలకు కాకుండా.. ఒక్కో నియోజకవర్గం వారీగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఆయా సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ కు ఈసీ షాక్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్