Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్

 ఓటుకు నోటు కేసులో  చంద్రబాబునాయుడు దొరికిన దొంగ కాదా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మోడీతో  తాను కుమ్మకై చంద్రబాబునాయుడును వేధిస్తున్నానని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు

Telangana cm kcr challenges to ap cm chandrababbunaidu
Author
Wanaparthy, First Published Oct 5, 2018, 6:00 PM IST

వనపర్తి: ఓటుకు నోటు కేసులో  చంద్రబాబునాయుడు దొరికిన దొంగ కాదా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మోడీతో  తాను కుమ్మకై చంద్రబాబునాయుడును వేధిస్తున్నానని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. నీ దమ్ము ఏమిటో... నా దమ్ము ఏమిటో తేల్చుకొందాం రా అంటూ కేసీఆర్  చంద్రబాబుకు సవాల్ విసిరారు.

వనపర్తిలో  శుక్రవారం నాడు   నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు 9 ఏళ్లు ఈ జిల్లాను దత్తత తీసుకొని ఏం చేశారని ప్రశ్నించారు. 

పాలమూరు గుండెలపై చంద్రబాబు గుద్దిండని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిగజారి.. చంద్రబాబును తెస్తున్నారని కేసీఆర్ చెప్పారు. ధరఖాస్తు తీసుకొని అమరావతికి వెళ్దామా... ఢిల్లీకి పోదామా ప్రశ్నించారు. ఢిల్లీ, అమరావతి గులాంలుగా మారుదామా.. ఆలోచించాలని కేసీఆర్ కోరారు.

చంద్రబాబును వేధిస్తున్నామా... నీవు పంపితివి... ఓ బుడ్డర్‌ఖాన్ తెచ్చే... దొరికే.... వాస్తవం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో నీవు అడ్డంగా దొరకలేదా.... అంటూ బాబును కేసీఆర్ ప్రశ్నించారు. 

కొందరు ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు మాట్లాడిన వాయిస్  వాయిస్ లేదా అని కేసీఆర్ బాబును ప్రశ్నించారు. చంద్రబాబు నీతో పొత్తా.... నీ అడుగు పెడితే పచ్చని చెట్టు కూడ మాడిపోతోందన్నారు. మహా కూటమి సంగతి తేల్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.నీ దమ్ముందో నా దమ్ముందే తేల్చుకొందాం రా అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు.

మోడీతో కలిసి వేధిస్తున్నానని బాబు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగు భాష, తెలుగు తల్లి అంటూ  మోసం చేయలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు.  జీవితంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకొంటామా అని కేసీఆర్ ప్రశ్నించారు.


సంబంధిత వార్తలు

డికె అరుణ బండారం బయటపెడతా: స్వరం పెంచిన కేసీఆర్

డిఫెన్స్‌లో కేసీఆర్: చంద్రబాబు టార్గెట్ అందుకే...

చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్

చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్

టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

 

Follow Us:
Download App:
  • android
  • ios