నల్గొండ: నల్గోండ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న  పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏమీ తెలియదన్నారు. ఆయనను చూస్తే తనకు జాలేస్తోందని కేసీఆర్ విమర్శించారు. 1952 నుండి ఢిల్లీని చూస్తే  కాంగ్రెస్ పార్టీ నేతల లాగులు తడుస్తాయని చెప్పారు. 

గురువారం నాడు నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లాకు తనకు ఉద్వేగపూరితమైన సభ ఉందన్నారు. కోదాడ నుండి  హలియా వరకు పాదయాత్ర చేసినట్టు కేసీఆర్ గుర్తు చేశారు. ఫ్లోరైడ్ విషయమై తాను  వందల సభల్లో ప్రసంగించినట్టు చెప్పారు.

అవమానాలు, విమర్శలు ఎదుర్కొంటూ 14 ఏళ్లుగా ఎత్తిన జెండాను దించకుండా ముందుకెళ్లినట్టు చెప్పారు.14 ఏళ్లుగా నిరంతరంగా నిరంతర పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని  సాధించినట్టు కేసీఆర్ గుర్తు చేశారు.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు  చేనేత కార్మికులు ఏడుగురు ఇదే జిల్లాలో ఆత్మహత్యలు చేసుకొన్నారని... వారికి పరిహారం ఇవ్వాలని కోరితే ఇవ్వలేదన్నారు. అయితే తాను ఆనాడూ బిక్షాటన చేసి చేనేత కార్మికులకు  పరిహారాన్ని ఇచ్చినట్టు తెలిపారు.

ఉద్యోగులు అర్ధాకలితో పనిచేశారని వారందరికీ జీతాలు పెంచి గౌరవంగా బతికేలా చేసినట్టు చెప్పారు. ఉద్యోగులు తమ పార్టీకి దీవెనలను అందిస్తే  మళ్లీ అధికారంలోకి వస్తే  వేతనాలను గౌరవంగా బతికేలా పెంచుతామని తెలిపారు.

ఇంటింటికి మంచినీరు త్వరలోనే ఇవ్వనున్నట్టు చెప్పారు. మిషన్ భగీరథ పనులు 99 శాతం పనులు పూర్తికానున్నాయని చెప్పారు. నాలుగున్నర ఏళ్లలో చేపట్టిన  సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను  చేపట్టిన విషయాన్ని కేసీఆర్ చెప్పారు.  అంచెలంచెలుగా అన్ని సమస్యలను  పరిష్కరించినట్టు కేసీఆర్ చెప్పారు. 

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శాపమని కేసీఆర్ చెప్పారు. నాగార్జునసాగర్‌ను  నందికొండ వద్ద కట్టాల్సి ఉండగా... ఆనాడు నెహ్రు అంటే భయమన్నారు.  180 టీఎంసీలు, ఏపీకి 60 టీఎంసీలు తీసుకోవాల్సి ఉంది. కానీ, ఆనాడు  కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చెందిన నేతలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. 

18 కి.మీ ముందుకు తెచ్చి నాగార్జునసాగర్ వద్ద ప్రాజెక్టును కట్టారని కేసీఆర్ చెప్పారు. 132 టీఎంసీలంటే  బూర్గుల రామకృష్ణారావు మూతి ముడుచుకొని సాగర్ ప్రాజెక్టును శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. కనీసం నిరసన కూడ చెప్పలేదన్నారు.

టీడీపీ నేతలు చంద్రబాబుకు గులాంలైతే, కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి గులాంలుగా మారారని కేసీఆర్ విమర్శించారు. ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి కోటి ఎకరాలకు నీరు ఇచ్చేందుకు  ప్లాన్ చేసినట్టు కేసీఆర్ తెలిపారు.

రీ డిజైన్‌పై అసెంబ్లీలో పవర్ ప్రజేంటేషన్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుండి పారిపోయిందని కేసీఆర్ విమర్శించారు. ఉత్తమ్‌కు ఏమీ తెలియదన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని చూస్తే తనకు జాలేస్తోందన్నారు.ఉత్తమ్‌కుమార్ రెడ్డితో  పోట్లాడకుండా తమ పార్టీకి చెందిన నేతలు మొద్దుబారిపోతున్నారని కేసీఆర్ చమత్కరించారు. 

పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చెత్తనాయకులు నల్గొండలోనే ఉన్నారని  కేసీఆర్ ఆరోపించారు. రైతులపై ప్రేమ ఉంటే... ప్రాజెక్టుల రీ డిజైన్ గురించి ఎందుకు ప్రశ్నించలేదని కేసీఆర్  ప్రశ్నించారు. . 

నల్గొండ జిల్లాలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ  అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి పవర్ ప్రాజెక్టును తెచ్చారా  అని  కేసీఆర్ ప్రశ్నించారు. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుకు పర్యావరణ క్లియరెన్స్ రాకుండా కోర్టులో కాంగ్రెస్ నేతలు కేసులు వేయిస్తున్నారని  ఆయన చెప్పారు.

మంత్రి పదవి కోసమే  జానారెడ్డి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని కేసీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని తాను జానారెడ్డి ముఖం మీదే చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు. 

ఫ్లోరైడ్ గురించి ఎవరూ పట్టించుకోకపోతే  దుశ్చర్ల సత్యనారాయణ పోరాటం చేశారని ఆయన చెప్పారు.  ఆనాడు వాజ్‌పేయ్  ప్రధానమంత్రిగా ఉండగా ఫ్లోరైడ్ బాధితులను తీసుకెళ్లి నల్గొండ ప్రజల బాధను  ప్రధానికి వివరించినట్టు కేసీఆర్ చెప్పారు.

తాను చెప్పిన విషయాలు కరెక్టైతే టీఆర్ఎస్ అభ్యర్థులను  గెలిపించాలన్నారు. తాను చెప్పిన విషయాలను అబద్దమైతే   టీఆర్ఎస్  అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యేలా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏ అనుమానం లేదు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తోందని కేసీఆర్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?