Asianet News TeluguAsianet News Telugu

డికె అరుణ బండారం బయటపెడతా: స్వరం పెంచిన కేసీఆర్

 భాగోతంలో బుడ్డర్‌ఖాన్‌లు కత్తులు తిప్పినట్టుగా కాంగ్రెస్ నేతలు  ఆలంపూర్‌లో  కత్తులు తిప్పారని కేసీఆర్ విరుచుకుపడ్డారు. 

Trs chief kcr slams on congress leaders
Author
Wanaparthy, First Published Oct 5, 2018, 5:31 PM IST


వనపర్తి: భాగోతంలో బుడ్డర్‌ఖాన్‌లు కత్తులు తిప్పినట్టుగా కాంగ్రెస్ నేతలు  ఆలంపూర్‌లో  కత్తులు తిప్పారని కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల సంగతి తర్వాత చెబుతానని కేసీఆర్ విమర్శించారు. ఆలంపూర్ సభలో కాంగ్రెస్ నేతలు కత్తుల విన్యాసం చేయడంపై  కేసీఆర్ విమర్శలు గుప్పించారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి‌లో శుక్రవారం నాడు  జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.నల్గొండ, వనపర్తి సభల్లో పల్లీలు అమ్ముకొనే  మంది కూడ ఆలంపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సభకు జనం రాలేదన్నారు.  ఈ సభలో పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తనను బట్టేబాజ్, దోఖేబాజ్  అని విమర్శిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

భాగోతంలో బుడ్డర్‌ఖాన్ లు  తిప్పినట్టు  కత్తులు తిప్పారు. కత్తులు తిప్పాల్సిన చోట తిప్పకుండా.. తిప్పకూడని చోట కత్తులు తిప్పారన్నారు. భవిష్యత్తులో  కాంగ్రెస్ నేతల సంగతి తర్వాత చెబుతానని కేసీఆర్ హెచ్చరించారు.

14 ఏళ్ల పాటు  పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నాం... ఈ పోరాటంలో ఎన్నో దఫాలు పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చినట్టు  కేసీఆర్ గుర్తుచేశారు.
టీడీపీ, కాంగ్రెస్‌లు 58 ఏళ్లు పాలించినట్టు చెప్పారు. ఈ నాలుగేళ్లలో పాలమూరు ఎలా ఉంది, కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎలా ఉందో పాలమూరు ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.

2014 వరకు  అనేక సమస్యలతో  తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. సమైక్య పాలకులు  రాష్ట్రాన్ని అధోగతిపాల్జేశారని చెప్పారు. వనపర్తికి చెందిన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అసెంబ్లీలో గొర్రెపిల్లలు, చేప పిల్లలు తప్ప ఇతర విషయాలు పట్టవా అని  ఆయన ఎద్దేవా చేశారని చెప్పారు.

యాదవ, తెలగ వర్గాలు చిన్నారెడ్డగికి  పట్టరా అని కేసీఆర్ ప్రశ్నించారు. గొర్రెలంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియదన్నారు. తెలంగాణలోని గొల్ల, కురుమల ఆదాయం రెట్టింపైందని కేసీఆర్ తెలిపారు. 

వెయ్యి కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు.  గీత కార్మికులకు,నాయి బ్రహ్మణులకు న్యాయం  చేయూత అందించినట్టు  కేసీఆర్ చెప్పారు. 

ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని ఎందుకు బహిష్కరించిందని ఆయన ప్రశ్నించారు. పాలమూరును ఎండబెట్టి పోతిరెడ్డి పాడుకు బొక్కపెట్టింది కాంగ్రెస్ నేతలని కేసీఆర్ కాంగ్రెస్ ను దుయ్యబట్టారు. 

మంత్రి పదవులకు ఆశపడి సమైఖ్య పాలకులకు గులాంలుగా మారారని చెప్పారు. వైఎస్ ఏపీకి పోతిరెడ్డి పాడు నీళ్లు తీసుకెళ్తే టీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేశారని కేసీఆర్ చెప్పారు. 

డీకే అరుణ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. నీ బండారం బయటపెడతానని కేసీఆర్ హెచ్చరించారు.  ఏం మాట్లాడుతున్నావో ఆలోచించుకోవాలని కేసీఆర్ హెచ్చరించారు. 


 

 

సంబంధిత వార్తలు

డిఫెన్స్‌లో కేసీఆర్: చంద్రబాబు టార్గెట్ అందుకే...

చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్

చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్

టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

Follow Us:
Download App:
  • android
  • ios