Asianet News TeluguAsianet News Telugu

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ వాస్తు, జ్యోతిష్యం, ముహుర్తాలను విపరీతంగా నమ్ముతారు. ఏదైనా పనిని చేపట్టేలంటే ఆయన ఆయన ఖచ్చితంగా ముహుర్తాలను జాగ్రత్తగా చూసుకొంటారు

telangana elections:kcr believes sentiments
Author
Hyderabad, First Published Oct 7, 2018, 11:26 AM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ వాస్తు, జ్యోతిష్యం, ముహుర్తాలను విపరీతంగా నమ్ముతారు. ఏదైనా పనిని చేపట్టేలంటే ఆయన ఆయన ఖచ్చితంగా ముహుర్తాలను జాగ్రత్తగా చూసుకొంటారు.అయితే  తెలంగాణలో పోలింగ్ జరిగే రోజు అమావాస్య. అమావాస్య రోజున కేసీఆర్ ఏ కార్యక్రమాలు పెట్టుకోరు. ప్రస్తుతం ఇదే  హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ముహుర్తాలంటే విపరీతంగా నమ్ముతారు. శనివారం, మంగళవారం ఎక్కడ కూడ పర్యటనలు పెట్టుకోరు. అత్యవసరమైతే తప్పు ఈ రెండు రోజుల్లో ఆయన  బయటకు వెళ్లరు.  ఈ రెండు రోజుల్లో  కూడ కార్యక్రమాలను చేపట్టరు.  

2018 సెప్టెంబర్ 6 వతేదీన కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు.  దీంతో  ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు  ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 7వ తేదీ అమావాస్య.  ఆరోతేదీ కేసీఆర్‌కు అదృష్ట సంఖ్య.

తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్‌ను కేసీఆర్‌కు కలిసొచ్చిన 6వ తేదీన ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ, పోలింగ్ మాత్రం డిసెంబర్ 7వ తేదీన జరుగుతోంది. కానీ, అదే రోజు అమావాస్య .  అసెంబ్లీ రద్దు చేసిన రోజు కూడ కేసీఆర్ ముహుర్తాన్ని చూసుకొన్నారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

సెప్టెంబర్ 6వ తేదీన గురువారం మధ్యాహ్నం అసెంబ్లీని రద్దు చేశారు. ద్వాదశి ఘడియల్లో పుష్యమి నక్షత్రం ప్రవేశించిన తర్వాత  అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్  తీర్మానం చేసింది.

డిసెంబర్ 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. కౌంటింగ్‌ రోజున చవితి ఉంది. ఓట్ల లెక్కింపు జరిగే 11న ఉత్తరాషాఢ నక్షత్రం ఉందని, అది కేసీఆర్‌కు క్షేమతార అవుతుందని కొందరు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్రాలు... తిథులు కేసీఆర్‌కు కలిసొస్తాయా లేదా అనేది  ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్

డికె అరుణ బండారం బయటపెడతా: స్వరం పెంచిన కేసీఆర్

డిఫెన్స్‌లో కేసీఆర్: చంద్రబాబు టార్గెట్ అందుకే...

చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్

చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్

టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం

 

Follow Us:
Download App:
  • android
  • ios