అక్టోబర్ 9వ తేదీన  కరీంనగర్ జిల్లాలో అనుమానాస్పదస్థితిలో  గడ్డం కుమార్‌ మృతి చెందిన ఘటనపై  పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు

కరీంనగర్: అక్టోబర్ 9వ తేదీన కరీంనగర్ జిల్లాలో అనుమానాస్పదస్థితిలో గడ్డం కుమార్‌ మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన గడ్డం కుమార్‌ను ప్రియురాలు కుటుంబసభ్యులు హత్య చేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుమార్ అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పోలీసులపై కుమార్ కుటుంబసభ్యులు తీవ్రమైన ఆరోపణలు కూడ చేశారు.

కుమార్‌ది పరువు హత్య అంటూ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. కుమార్ మృతి చెందాడనే విషయం తెలుసుకొన్నకుటుంబసభ్యులు పోలీసు వాహనంపై కూడ ఆ రోజు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

ఈ విచారణ కమిటీ విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయనే సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అనుమానితులను ప్రశ్నించిన సమయంలో పోలీసులకు కొన్ని విషయాలు తెలిశాయని ప్రచారం సాగుతోంది.ఈ ఘటనకు సంబంధించి పోస్ట్‌మార్టం నివేదికతో పాటు శాస్త్రీయంగా కుమార్ అనుమానాస్పద మృతి కేసును చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

మృతదేహం బోర్లాపడి ఉండడం.... కుమార్ అదృశ్యమైన రోజున ప్రియురాలి కుటుంబసభ్యులు గొడవకు దిగారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అందరినీ చంపైనా నన్ను పెళ్లాడుతానన్నాడు: కుమార్ లవర్

కుమార్ అనుమానాస్పద మృతి: మా వైఫల్యం లేదు: ఏసీపీ

ఫోన్ చేసి పిలిచి చంపారు: కుమార్ తల్లి

కరీంనగర్ పరువు హత్య: జైలు నుండి వచ్చిన తెల్లారే లవర్‌ను తీసుకెళ్లిన కుమార్

కరీంనగర్ పరువు హత్య: ఆదివారం నాడే కుమార్ మిస్సింగ్

కరీంనగర్ పరువు హత్య: దీపావళి తర్వాత పెళ్లి, ఇంతలోనే.....

తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన