10వ, తరగతి నుండే  మాధవి, సందీప్‌లు ప్రేమించుకొంటున్నారు.  కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని మాధవి తండ్రి నర్సింహ్మచారి దాడికి పాల్పడ్డాడు.

హైదరాబాద్: 10వ, తరగతి నుండే మాధవి, సందీప్‌లు ప్రేమించుకొంటున్నారు. కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని మాధవి తండ్రి నర్సింహ్మచారి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాధవి, సందీప్‌ల ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలుసు. అయితే సందీప్, మాధవిల ప్రేమ విషయం గురించి 2013 నుండి కొనసాగుతోంది. ఈ ప్రేమ విషయం తెలిసిన సందీప్ సోదరుడు ఈ విషయమై సందీప్ ను వారించాడు. మేజర్‌ అయ్యే వరకు సందీప్ ను సోదరుడు వారించాడు. మేజర్ అయిన తర్వాత సందీప్, మాధవిని వివాహం చేసుకొన్నాడు.

సందీప్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. మాధవి బీసీ సామాజిక వర్గానికి చెందింది. అయితే కులాంతర వివాహం చేసుకోవడం నర్సింహ్మాచారికి నచ్చలేదు. ప్రేమించిన పెళ్లి చేసుకొన్న సందీప్‌పై మాధవి తండ్రి నర్సింహ్మాచారికి నచ్చలేదు.

వారం రోజులుగా కుటుంబసభ్యులు, పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. కూతురును తమ వద్దకు రావాలని నర్సింహ్మచారి కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆమె మాత్రం సందీప్‌తోనే ఉంటానని తేగేసి చెప్పింది.దీంతో ఈ విషయం నచ్చని నర్సింహ్మాచారి పథకం ప్రకారం ఆ దంపతులపై దాడికి పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన