Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ పరువు హత్య: దీపావళి తర్వాత పెళ్లి, ఇంతలోనే.....


కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన  కుమార్ అనే  యువకుడి అనుమానాస్పద మృతి  గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. 

kumar decides to marry his lover after diwali this year
Author
Karimnagar, First Published Oct 9, 2018, 11:18 AM IST

కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన  కుమార్ అనే  యువకుడి అనుమానాస్పద మృతి  గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. దీపావళి తర్వాత ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని  కుమార్ భావించాడు.అయితే ఈ తరుణంలోనే ఆయన  మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన కుమార్  అదే ప్రాంతంలోని  వంకాయలగూడెం గ్రామానికి చెందిన  ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.

ఆ అమ్మాయి ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.  వీరిద్దరివి వేర్వేరు కులాలు. దీంతో  రెండు కుటుంబాలు వీరిద్దరి పెళ్లి విషయమై చర్చించారు. 

దీపావళి తర్వాత ఆ అమ్మాయి మేజర్‌ అవుతోంది. దీంతో దీపావళి తర్వాత  పెళ్లి చేయాలని  రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి  పెళ్లికి  ఎలాంటి ఆటంకాలు లేవని భావించిన తరుణంలోనే రెండు కుటుంబాల మధ్య ఇటీవల కాలంలో  చిన్న గొడవలు చోటు చేసుకొన్నాయి.

దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు.  ఈ తరుణంలోనే  కుమార్  వంకాయలగూడెం సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో కుమార్ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కుమార్ ప్రేమించిన  యువతి కుటుంబసభ్యులే  అతడిని హత్యచేసి ఉంటారని  భావిస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్ హుజూరాబాద్  రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

Follow Us:
Download App:
  • android
  • ios