హైదరాబాద్: తన కూతురు మాధవి, అల్లుడు సందీప్‌లను బెదిరించాలనుకొన్నా... కానీ, ఇలా జరిగిందని మనోహారాచారి చెప్పారు. తన అల్లుడు మంచోడేనని మనోహారాచారి చెప్పారు. 

బుధవారం సాయంత్రం ఎస్ఆర్ నగర్ సమీపంలో కూతురు, అల్లుడుపై  దాడికి దిగిన మనోహారాచారిని పోలీసులు గురువారం నాడు కోర్టుకు తరలించారు.

కోర్టుకు తరలించే .సమయంలో మనోహారాచారి  మీడియాతో మాట్లాడారు. ఈ  సందర్భంగా  ఆయన సంచలన విషయాలను వెల్లడించారు.ఆవేశంలోనే  కత్తితోనే దాడి చేసినట్టు మనోహారాచారి చెప్పారు.

ఈ దాడికి తన భార్యే కారణమన్నారు.  తన కూతురికి బదులుగా భార్యను చంపితే బాగుండేదన్నారు. తనకు ఎవరిమీద కోపం లేదన్నారు. చిన్నప్పటి నుండి  మాధవిని అల్లారు ముద్దుగా పెంచి పెద్దా చేశానని ఆయన చెప్పారు.

కొడుకు కంటే ఎక్కువగా చూసుకొన్నానని చెప్పారు. ఆమె బతికాలని కోరుకొంటున్నానన్నారు. తన భార్య  ఒక్క మాట కూడ చెప్పలేదన్నారు. అల్లుడు కూడ మంచోడనే అని చెప్పారు.  నా భార్యకు కూడ ఈ విషయం తెలిసి కూడ దాచిపెట్టిందన్నారు. అందుకే ఆమెను చంపాలని భావించినట్టు చెప్పారు. తన కూతురు వ్యవహారాన్ని తన భార్య దాచిపెట్టిందన్నారు.   ఈ విషయాన్ని భార్య చెప్పకపోవడంపై మనోహారాచారి సీరియస్ అయ్యాడు.  

తనకు ఒక్కమాట చెబితే తాను ఘనంగా కూతురి వివాహం చేసేవాడినని ఆయన తెలిపారు.కానీ, ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకొన్నారని చెప్పారు.  తనకు తెలియకుండా పెళ్లి చేసుకొన్నారనేది తనకు అత్యంత బాధ కల్గించిందన్నారు. 

సంబంధిత వార్తలు

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన