తన కొడుకు హత్య విషయంలో తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయంటున్నారు ప్రణయ్ తండ్రి బాలస్వామి.

మిర్యాలగూడ పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నిందితులందరినీ పోలీసులు మీడియా ముందుకూడా ప్రవేశపెట్టారు. అయితే.. తన కొడుకు హత్య విషయంలో తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయంటున్నారు ప్రణయ్ తండ్రి బాలస్వామి.

‘‘ప్రణయ్‌ హత్య కేసులో పోలీసులపై నాకు విశ్వాసం ఉంది. పోలీసులు మీడియా ముందు అన్ని విషయాలు చెప్పారు. కానీ, నాకు ఒక సందేహం ఉంది. కత్తిపై ఉన్న వేలిముద్రలు, బీహార్‌లో పట్టుబడిన హంతకుడు శర్మ వేలిముద్రలు ఒకటా కాదా.. అనే విషయాన్ని ఎస్పీగారు చెప్పలేదు. వేలిముద్రలు ధ్రువీకరణ కాకపోతే హంతకుడు తప్పించుకునే అవకాశం ఉంది. హంతకుడు డబ్బున్న వాడు అయినందున చేసిన పనికి ఉరిశిక్ష పడితేనే మేం సంతోషిస్తాం. మారుతీరావు బయటకు వస్తే మళ్లీ ఇలాంటి హత్యలే చేస్తాడని భయమేస్తోంది. మారుతీరావుకు, శర్మకు ఉరిశిక్ష పడేలా ప్రజాసంఘాలు, పార్టీలు, పోలీసులు ఒత్తిడి చేయాలి. ప్రణయ్‌ని చంపిన వాడు రేపు మమ్ములను చంపడని గ్యారెంటీ ఏముంది.. అమ్మాయి అమృతను కిడ్నాప్‌ చేసి మానుంచి దూరం చేసే ప్రమాదమూ ఉంది. అందుకే నిందితులపై పీడీయాక్ట్‌ పెట్టి, కొత్త చట్టాలను తెచ్చి జైలు నుంచి బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.’’ అని బాలస్వామి పేర్కొన్నారు. 

read more news

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ...