హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్‌ను  మారుతీరావు  చంపించినట్టుగా తాను చేయనని ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద నవ దంపతులపై దాడికి పాల్పడిన మనోహారాచారి  తమను నమ్మించాడని సందీప్ తల్లి రమాదేవి చెప్పారు.

సందీప్ తల్లి గురువారం నాడు  ఓ మీడియాచానెల్‌తో మాట్లాడారు. 2013 నుండి  సందీప్, మాధవి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందన్నారు. 2015లో ఈ విషయం మాధవి ఇంట్లో తెలిసిందన్నారు. 

అయితే ఈ విషయమై  సందీప్‌ ను పిలిపించి మనోహారాచారి బంధువులు మాట్లాడారని చెప్పారు. ఆ సమయంలోనే సందీప్, మాధవిలకు నచ్చజెప్పినట్టు  ఆమె చెప్పారు.  ఈ ఘటన తర్వాత మాధవిని అదుపులో ఎందుకు పెట్టుకోలేకపోయారని ఆమె ప్రశ్నించారు.

కూతురు ఎవరితో మాట్లాడుతోంది..  ఎక్కడికి వెళ్తోందనే విషయంపై నిఘా పెడితే మాధవి .. సందీప్‌తో ప్రేమను కొనసాగించేది కాదన్నారు. అయితే  మాధవి, సందీప్ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందన్నారు.

సెప్టెంబర్ 12 వ తేదీన రిజిస్టర్ మ్యారేజీ చేసుకొన్నారని సందీప్ తల్లి రమాదేవి చెప్పారు. పెళ్లి చేసుకొన్న తర్వాత  ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్‌లో కూడ రక్షణ కోసం  వినతి పత్రం సమర్పించినట్టు రమాదేవి చెప్పారు.

ఇదిలా ఉంటే  ప్రతిరోజూ డ్యూటీకి వెళ్లే సమయంలోనూ,... ఇంటికి తిరిగి వచ్చే సమయంలోనూ మనోహారాచారి తమ ఇంటికి వచ్చి కూతురితో మాట్లాడేవాడని రమాదేవి గుర్తు చేసుకొన్నారు.

అయితే తన కూతురికి ఏమైనా జరిగితే  ఇంటిపై బాంబులు వేస్తానని కూడ బెదిరించాడని కూడ రమాదేవి చెప్పారు. తన కూతురిని బాగా చూసుకోవాలని కూడ  చెప్పేవాడన్నారు.  తనది రాయలసీమ ప్రాంతమని.... అక్కడ ముగ్గురిని హత్య చేశానని... తన కూతురికి ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోనని చెప్పేవాడని రమాదేవి చెప్పారు.

అయితే మిర్యాలగూడలో ప్రణయ్‌ను మారుతీరావు చంపించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తాను ఆ రకంగా చేసే వాడిని కాననని చెప్పారు.  మంచిగా బతికి ఉండాలని తాను కోరుకొనేవాడినని మనోహారాచారి తమను నమ్మించాడని రమాదేవి చెప్పారు.ఇలా నమ్మించి బట్టలు పెడతానని పిలిపించి దాడికి పాల్పడ్డాడడని రమాదేవి చెప్పారు.

 

సంబంధిత వార్తలు

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన