Asianet News TeluguAsianet News Telugu

కుమార్ అనుమానాస్పద మృతి: మా వైఫల్యం లేదు: ఏసీపీ

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన  కుమార్  అనుమానాస్పద మృతి కేసులో  తమ వైఫల్యం లేదని  ఏసీపీ కృపాకర్ రావు చెప్పారు.  

No negligence on kumar missing incident says acp kamalakar rao
Author
Karimnagar, First Published Oct 9, 2018, 6:26 PM IST

కరీంనగర్: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన  కుమార్  అనుమానాస్పద మృతి కేసులో  తమ వైఫల్యం లేదని  ఏసీపీ కృపాకర్ రావు చెప్పారు.  మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు చేసిన  వెంటనే కేసు రిజిస్టర్ చేసినట్టు తెలిపారు.

సంఘటనాస్థలం వద్ద మృతుడి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసు ఉన్నతాధికారుల కాళ్లు పట్టుకొని  తమకు న్యాయం చేయాలని  మృతుడి తల్లి కోరారు.

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు  కుమార్ అదృశ్యం జరిగిన ఘటనపై  కేసు నమోదు చేసినట్టు ఏసీపీ  కృపాకర్ రావు తెలిపారు.  కుమార్ శనివారం నాడు తన లవర్‌ను హూజూరాబాద్‌లోని కాలేజీ నుండి నిజామాబాద్‌కు తీసుకెళ్లాడని ఆదివారం నాడు లవర్‌తో కలిసి స్వగ్రామానికి చేరుకొన్నారని  ఏసీపీ తెలిపారు.

ఆదివారం రాత్రి నుండి కుమార్ కన్పించకపోయినా... సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులు  ఫిర్యాదు చేయగానే  స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేశారని  ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే ఏడాది క్రితం అమ్మాయి కుటుంబసభ్యులు కుమార్‌పై కేసు పెట్టారని చెప్పారు. అయితే ఆరు మాసాల తర్వాత అమ్మాయి కుటుంబసభ్యులు కుమార్‌తో ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేసేందుకు ఒప్పుకొన్నారని మృతుడు కుమార్ సోదరుడు తెలిపారు.

మూడు రోజుల క్రితం కుమార్ కు, ఆమె తండ్రికి మధ్య గొడవ జరిగిందని ఆయన చెప్పారు. కుమార్‌ను ఇంటికి పిలిపించిన తర్వాత కుమార్  అనుమానాస్పదస్థితిలో మరణించారని ఆయన తెలిపారు.
 

సంబంధిత వార్తలు

ఫోన్ చేసి పిలిచి చంపారు: కుమార్ తల్లి

కరీంనగర్ పరువు హత్య: జైలు నుండి వచ్చిన తెల్లారే లవర్‌ను తీసుకెళ్లిన కుమార్

కరీంనగర్ పరువు హత్య: ఆదివారం నాడే కుమార్ మిస్సింగ్

కరీంనగర్ పరువు హత్య: దీపావళి తర్వాత పెళ్లి, ఇంతలోనే.....

తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

 

Follow Us:
Download App:
  • android
  • ios