Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్: పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు


నగరంలోని పాతబస్తీలో మైనర్ బాలికపై సామూహి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయమై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.గంజయి, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి  అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు  పిర్యాదు చేసింది.

Hyderabad Police Found Key information in minor girl rape case
Author
First Published Sep 15, 2022, 11:28 AM IST

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి పోలీసులు  తమ దర్యాప్తులో  కీలక విషయాలను గుర్తించారు. ఈ నెల 12వ తేదీన బాలికను కారులో కిడ్నాప్ చేసిన నిందితులు నాంపల్లిలోని లాడ్జీలో  ఉంచి అత్యాచారానికి పాల్పడ్డారు. లాడ్జీలో రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైద్రాబాద్ నగరంలోని పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే బాలికను నిందితులు కారులో కిడ్నాప్ చేశారు.  నాంపల్లిలోని లాడ్జీకి తీసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది.  మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో  మంచినీటిలో టాబ్లెట్లు ఇచ్చారని బాధితురాలు పోలీసులతో పాటు కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధితురాలు చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.  బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు.  అక్కడి నుండి ఆమెను భరోసా సెంటర్ కు తరలించారు. బాలిక ఇచ్చిన సమాచారం  ఆధారంగా పోలీసులు రబీష్, నిమాయత్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో వ్యక్తి  కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు కూడా గంజాయి, మత్తు ఇంజక్లన్ల అమ్మకాల్లో కీలక సూత్రధారులని పోలీసులు చెబుతున్నారు. 

also read:హైదరాబాదులో దారుణం : లాడ్జీలో బాలికపై రెండు రోజులపాటు గ్యాంగ్ రేప్..

బాలిక చెప్పిన సమాచారం ఆధారంగా తమ అదుపులో ఉన్న ఇద్దరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. నిందితులను కఠినంగాశిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రెండు లాడ్జీల్లో బాలికపై లైంగిక దాడి

తొలుత ఒక్క లాడ్డీలోనే బాలికపై లైంగిక దాడి చేసినట్టుగా అనుమానించారు. కానీ విచారణలో నిందితులు రెండు లాడ్జీల్లో బాలికపై అత్యాచారానికా పాల్పడిన విషయాన్ని గుర్తించారని ఈ కథనంతెలిపింది. రెండు లాడ్జీల్లో నిందితులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఈ నెల 12వ తేదీనే  నిందితులు బాలికనె కిడ్నాప్ చేశారు.  12వ తేదీన రాత్రి  ఓ లాడ్జీకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన తర్వాత బాలికను రూమ్ లోనే ఉంచి బయటకు వెళ్లారు రూమ్ లాక్ పడితే రూమ్ లాక్ ను బద్దలు కొట్టారని లాడ్జీ సిబ్బంది మీడియాకు చెప్పారు.. లాడ్జీలో చేరిన తర్వాత గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో ఖాళీ చేయాలని చెప్పడంతో లాడ్జీ ఖాళీ చేశారని లాడ్జీ సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత మరో లాడ్జీలో బాలికపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తంచారు. ఈ రెండు లాడ్జీ సిబ్బందిని ప్రశ్నించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ  కథనం ప్రసారం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios