Asianet News TeluguAsianet News Telugu

ఛీ.. కన్న కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి.. గర్భం దాల్చడంతో...

ఓ తండ్రి వావివరసలు మరిచి, కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. 

father molestation daughter and impregnate her in rangareddy district - bsb
Author
First Published Jan 17, 2023, 9:52 AM IST

రంగారెడ్డి జిల్లా : కన్నకూతుర్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న తండ్రుల ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కంటికి రెప్పలా కూతుర్లను కాపాడుకోవాల్సిన తండ్రులే వారిపై కామాంధులై దాడులకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో వెలుగు చూసింది. కన్న తండ్రి అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. ఆమనగల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన  వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతడికి 37 ఏళ్లు. 

నాలుగు నెలల క్రితం బతుకుతెరువు కోసం భార్య, పెద్ద కూతురుని తీసుకుని దుండిగల్ వెళ్ళాడు. అతనికి ముగ్గురు కూతుర్లు. పెద్ద కూతురు వయసు 14 సంవత్సరాలు. చదువు మాన్పించి తమతో పాటు పనులకు తీసుకువెళ్లాడు. సొంత గ్రామంలో ఉన్నప్పుడు..  దుండిగల్ వెళ్లిన తర్వాత తల్లి లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

కాగా, సంక్రాంతి సందర్భంగా  ఊరికి వచ్చారు. తండ్రి తనపై చేస్తున్న అఘాయిత్యాన్ని బాలిక ఆ సమయంలో తల్లి, నానమ్మలకు తెలిపింది. ప్రస్తుతం ఆ బాలిక మూడు నెలల గర్భవతి. విషయం వెలుగులోకి రావడంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు, బాలిక  బంధువులు ఆ నీచుడిపై దాడి చేశారు. బాధిత బాలిక తల్లి సోమవారం భర్తమీద ఆమనగల్లు పోలీసులకు  ఫిర్యాదు చేసింది. 

10 రోజుల్లో పనులను పూర్తి చేయాలి: సచివాలయ పనులపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష

ఇదిలా ఉండగా, వావివరుసలు మరిచిపోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడు అన్నెం పున్నెం తెలియని కూతురిని కాటేశాడు. మూడేళ్ల పాటు కూతురిపై తండ్రి అత్యాచారం చేశాడు. ఆ సంఘటన జనవరి 14నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో వెలుగు చూసింది. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న మాచవరానికి చెందిన వ్యక్తి ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు. అతని భార్య ఓసారి భర్త, పెద్ద కూతురి నగ్న చిత్రాలను చూసింది. దాని గురించి భర్తను ప్రశ్నించింది. అవి నిజమైన ఫొటోలు కావని అతను బుకాయించాడు. దాంతో ఆమె మిన్నకుండిపోయింది. ఆ తర్వాత అతను ఆ ఫొటోలను తీసేశాడు. 

భర్త ప్రవర్తన సరిగా లేదని గ్రహించిన అతని భార్య ఇద్దరు కూతుళ్లను కూడా 2022 జులై నుంచి గన్నవరంలోని ఓ హాస్టల్లో చేర్చి చదివిస్తోంది. సెలవులు కావడంతో ఈ నెల 7వ తేదీన కూతుళ్లు ఇంటికి వచ్చారు. అయితే, పెద్ద కూతురు తండ్రికి దూరంగా ఉండసాగింది. దానికి ఆగ్రహించిన అతను ఆమెను బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్యను తిట్టాడు. తర్వాత కూతుళ్లు హాస్టల్ కు వెళ్లిపోయారు.

ఇద్దరు కూతుళ్లు కూడా తిరిగి 10వ తేదీన ఇంటికి వచ్చారు. ఆ రోజు సాయంత్యరం తండ్రి పెద్ద కూతురిని బ్యాంక్ పని ఉందని చెప్పి టూవీలర్ మీద తీసుకుని వెళ్లాడు. తిరిగి ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో పెద్ద కూతురు తల్లి వద్దకు వెళ్లి తండ్రి తనపై చేసిన దురాగతం గురించి చెప్పింది.  బ్యాంక్ కని చెప్పి తీసుకుని వెళ్లి రామవరప్పాడు పైవంతెన దగ్గరలో గల నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. 

తాను ప్రతిఘటించడంతో ముళ్ల కర్రతో కొట్టాడని కూడా చెప్పింది. తనపై తండ్రి మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని కూతురు తల్లితో చెప్పింది. తల్లి, కూతురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పదమూడేళ్ల బాలిక తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios