జగిత్యాల జిల్లాలో తెలంగాణ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొడింగ్యాల మండలంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొనేందుకు మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్ వెళుతుండగా..  రామసాగరం గ్రామంలో మంత్రుల కాన్వాయ్‌ని కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలు, స్థానిక రైతులు అడ్డుకున్నారు.

కొండగట్టు బస్సు ప్రమాదానికి సంబంధించి తమకు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని బాధితులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని తమ పొలాల వైపు మళ్లీంచాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు.

సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 2018 సెప్టెంబర్ 11న కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో 65 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 

ఆ చిన్నారిని చూసి భావోద్వేగానికి గురైన ఈటల

62కు చేరిన కొండగట్టు ప్రమాద మృతుల సంఖ్య

కొండగట్టు ప్రమాదం: స్టీరింగ్ విరిగి... బ్రేకులు ఫెయిలైనా.. డ్రైవర్ చివరి యత్నాలు

కొండగట్టు: ప్రమాదానికి ముందు డ్రైవర్ ఏం చెప్పాడంటే?

కొండగట్టు ప్రమాదాలు: అప్పట్లో వైఎస్, చంద్రబాబు ఇలా...

కొండగట్టు ప్రమాదం: 60 కోతులు చనిపోయిన రెండు రోజులకే ఇలా....

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...