జగిత్యాల: కొండగట్టు ఘాట్ రోడ్డులో  ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో  60 మంది  ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. మరో 20 మంది  చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో  60 కోతులు చనిపోవడం.. ఆ ఘటన  జరిగిన కొద్దిరోజులకే  ఈ బస్సు ప్రమాదం జరగడంతో  స్థానికంగా ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కొండగట్టు అంజన్నకు కోపం వచ్చిందా.... ఈ కోపం కారణంగానే  బస్సు ప్రమాదంలో  60 మంది ప్రాణాలు పోయాయా అనే విషయమై చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో కొడిమ్యాల మండలం సూరంపేట మామిడివాగు సమీపంలోని గోవిందారం దారి పక్కన 60 కోతుల కళేబరాలు లభ్యమయ్యాయి.

పంటలను నాశనం చేస్తున్నాయనే ఉద్దేశ్యంతోనే విద్యుత్ షాక్‌తో కోతులను చంపివేసి ఉంటారని  అటవీశాఖాధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే  కొండగట్టు అంజనేయస్వామి ఆలయం ఘాట్ రోడ్డు నుండి  కిందకు దిగుతున్న బస్సు బోల్తాపడి 60 మంది మృతి చెందారు.

కోతులను ఆంజనేయస్వామికి ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఈ కోతులు చనిపోయిన  రెండు రోజులకే అదే సంఖ్యలో ప్రయాణీకులు చనిపోవడంతో  అంజన్న కోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా... అనే చర్చ స్థానికంగా సాగుతోంది. 

అయితే కోతుల మరణానికి ఈ ప్రమాదానికి పొంతన లేకపోయినా... ఈ ఘటనలో మృతి చెందిన సంఖ్య   60 .  అంతేకాదు మంగళవారం నాడు ప్రమాదం చోటు చేసుకోవడంతో పాటు కొండగట్టు వద్దే ఈ ప్రమాదం జరగడంతో ఈ విషయమై స్థానికులు చర్చించుకొంటున్నారు.

ఈ వార్తలు చదవండి

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు ప్రమాదానికి కారణమిదే: బట్టబయలు చేసిన కండక్టర్

కొండగట్టు ప్రమాదం...బస్సు నడిపింది ఈ ఉత్తమ డ్రైవరే...

కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు బస్సు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే యాక్సిడెంట్