జగిత్యాల:మరో నిమిషం లోపుగానే జగిత్యాల ఆర్టీసీ బస్సు  ప్రధాన రహదారిపైకి చేరుకొనేది. అయితే ఘాట్ రోడ్డు నుండి కిందకు దిగుతున్న సమయంలోనే  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది.

మంగళవారం నాడు ఉదయం కొండగట్టు ఘాట్ రోడ్డుపై నుండి ఆర్టీసీ బస్సు  నాలుగు పల్టీలు కొట్టింది.  దీంతో  ఈ ప్రమాదంలో సుమారు 40మంది మృతి చెందారు.  పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కొండగట్టు ఘాట్ రోడ్డు నుండి  బస్సు మరో నిమిషం లోపుగానే ఆర్టీసీ బస్సు  ప్రధాన రహాదారికి చేరుకొనేది. అయితే ఘాట్ రోడ్డుపైన ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది.

ఘాట్ రోడ్డు నుండి బస్సు దిగుతున్న సమయంలోనే  స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు లోయలోకి పడిపోయింది. ఈ బస్సు  నాలుగు పల్టీలు కొట్టింది. బస్సు ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమా.. ఇతరత్రా కారణాలు ఉన్నాయా అనే విషయమై ఆరా తీస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా: 23 మంది మృతి

కొండగట్టు బస్సు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే యాక్సిడెంట్