జగిత్యాల: బ్రేకులు ఫెయిల్ కావడంతోనే బస్సు అదుపుతప్పిందని కొండగట్టు ప్రమాదంలో ప్రాణాలతో బతికి బయటపడిన సోమిడి అర్చన అనే బాలిక చెబుతోంది.  ప్రమాదానికి ముందు  బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని డ్రైవర్ అరిచాడని బస్సు నుండి దూకాలని కూడ కోరాడని ఆమె చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం కొండగట్టు ఘాట్ రోడ్డుపై జగిత్యాల ఆర్టీసీ బస్సు డిపోకు చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలో 60 మంది ప్రయాణీకులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. 

ఈ ప్రమాదంలో సోమిడి అర్చన అనే బాలిక తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొంది. తల్లి పుష్పతో కలిసి అర్చన తిర్మలాపూర్ వద్ద  బస్సు ఎక్కింది.  జగిత్యాల వెళ్లేందుకు ఈ బస్సును ఎక్కారు. 

బస్సు ఘాట్ రోడ్డు దిగుతున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయని డ్రైవర్ అరిచాడని అర్చన మీడియాకు చెప్పారు. డ్రైవర్ మాటలకు  ఓ వ్యక్తి బస్సులో నుండి దూకితే  అతడి ముఖం పూర్తిగా దెబ్బతిందన్నారు. 

భయంతో కేకలు వేస్తూ ఒకరిపై మరోకరు పడినట్టు ఆ బాలిక వివరించారు  అయితే ఈ ప్రమాదంలో అర్చన తల్లి పుష్పలత మరణించింది. అర్చన ప్రాణాలతో బతికి బయటపడింది. 

ఈ వార్తలు చదవండి

కొండగట్టు ప్రమాదం: 60 కోతులు చనిపోయిన రెండు రోజులకే ఇలా....

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు ప్రమాదానికి కారణమిదే: బట్టబయలు చేసిన కండక్టర్

కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు బస్సు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే యాక్సిడెంట్