జగిత్యాల: బస్సుకు ఫిట్‌నెస్ లేవకపోవడం వల్లే కొండగట్టు వద్ద ప్రమాదం చోటు చేసుకొందని  అధికారుల విచారణలో తేలింది. ప్రమాదానికి ముందే బస్సు స్టీరింగ్ విరిగిపోయింది. అంతేకాదు బ్రేక్ ఫెయిల్ అయిందని డ్రైవర్ శ్రీనివాస్ చెప్పారు. ప్రయాణీకులను ఈ బస్సును ప్రమాదం నుండి కాపాడేందుకు చివరి నిమిషం వరకు డ్రైవర్ కూడ చెప్పినట్టు క్షతగాత్రులు తెలిపారు.

సెప్టెంబర్ 11 వతేదీన కొండగట్టు ఘాట్ వద్ద  ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ బస్సు ప్రమాదంలో 60 మంది ప్రయాణీకులు మృతి చెందారు.  సుమారు 20 మందికిపైగా ప్రయాణీకులు  గాయపడ్డారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బస్సుకు ఫిట్‌నెస్  లేని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని అధికారులు గుర్తించారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై  ఆర్టీసీతో పాటు పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 16 మంది సాక్షులను విచారించి ఈ ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

అయితే ప్రమాదం జరగడానికి ముందే బస్సుకు బ్రేకులు ఫెయిలైనట్టు డ్రైవర్ అరిచినట్టు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులు చెప్పారు. ఆర్టీసీ, పోలీసు అధికారుల విచారణలో చెప్పారు. అంతేకాదు బస్సు లోయలో పడడానికి కొన్ని క్షణాల ముందే స్టీరింగ్ కూడ విరిగిపోయింది. బ్రేకులు కూడ ఫెయిల్ అయ్యాయి.

దీంతో ప్రమాదం జరగబోతోందని డ్రైవర్ పసిగట్టి ప్రయాణీకులను హెచ్చరించాడు. బస్సు అద్దాలు పగులగొట్టి ప్రాణాలు దక్కించుకోవాలని కోరినట్టు అరిచాడన్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడ బస్సు 60 నుండి 70 కి.మీ వేగంతో బస్సు ప్రయాణించిందని బస్సు కండక్టర్ పరమేశ్వర్ చెప్పారు.

ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద  బస్సు ఎగిరిందని ఆ సమయంలోనే సీట్లు కూడ విరిగిపోయాయని ప్రయాణీకులు ఒకరిపై మరోకరు పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అదే సమయంలో బస్సు లోయలో పడిపోయిందన్నారు.

బస్సు స్టీరింగ్, టైర్లతో పాటు కండిషన్ కూడ సరిగా లేదని  చెప్పినా కూడ పట్టించుకోలేదనే ఆరోపణలు కూడ లేకపోలేదు. ఈ కారణంగానే  బస్సు ప్రమాదానికి గురైనట్టుగా ప్రయాణీకులు చెబుతున్నారు.

ఈ వార్తలు చదవండి

కొండగట్టు: ప్రమాదానికి ముందు డ్రైవర్ ఏం చెప్పాడంటే?

కొండగట్టు ప్రమాదం: 60 కోతులు చనిపోయిన రెండు రోజులకే ఇలా...

కొండగట్టు ప్రమాదానికి కారణమిదే: బట్టబయలు చేసిన కండక్టర్

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా..

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు