జగిత్యాల: కొండగట్టు వద్ద మంగళవారం నాడు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గతంలో నాలుగు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.  అయితే అధికారులు  ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా ఈ బస్సుచోటు చేసుకొంది.

కొండగట్టు ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గతంలో నాలుగు ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకొన్నాయని స్థానికులు చెబుతున్నారు.

గతంలో కొత్తగా లారీ కొనుగోలు చేసిన ఓ కుటుంబం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకొంది. 

మరోవైపు ఆటో, జీపు, ట్రాక్టర్ ప్రమాదాలు కూడ చోటు చేసుకొన్నాయి. ఈ ఘాట్ రోడ్డులో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయనే విషయాన్ని తెలిసినా కూడ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల  ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకొందని చెబుతున్నారు.

మరో నిమిషంలోనే బస్సు  ప్రధాన రహదారికి చేరుకొనేది . అయితే ఘాట్ చివరిమలుపులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.